పైసల కోసం ప్రాణాలు తీస్తున్న ప్రైవేటు హాస్పిటల్స్

పైసల కోసం ప్రాణాలు తీస్తున్న ప్రైవేటు హాస్పిటల్స్

నిద్రపోతున్న అధికార యంత్రాంగం

విచ్చలవిడిగా రెచ్చిపోతున్న ప్రైవేటు ఆసుపత్రులు

జిల్లా అధికారుల పర్యవేక్షణ లోపమేనా

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 18 (అఖండ భూమి న్యూస్)

కామారెడ్డి పట్టణ కేంద్రంలో ప్రైవేటు పత్రుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది జిల్లా వైద్యాధికారులు సరియైన పర్యవేక్షణ లేకపోవడంతో వారికి నచ్చిన విధంగా ఆసుపత్రులు నడిపిస్తూ పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఇటువంటి ఘటనే ఈరోజు జరిగింది. దేవునిపల్లి కి చెందిన ఎల్లయ్య (55) ఆరోగ్యం బాగో లేకపోవడంతో కొడుకులు వారిని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొని వచ్చారు ఆసుపత్రి డాక్టర్లు సరైన దిశా నిర్దేశం చేయకుండా సరైన ట్రీట్మెంట్ చేయకపోవడంతో తన కొడుకు ఆరా తీయగా డబ్బులు కట్టాలని డిమాండ్ చేయడం జరిగింది అని డబ్బులు తీసుకొస్తానని మీరు ట్రీట్మెంట్ మొదలు పెట్టండి అని చెప్పి డబ్బుల సర్దుబాటు కోసం కొడుకు వెళ్ళాడు. అనంతరం ఆసుపత్రి వారు ట్రీట్మెంట్ అందజేయకుండా పేషెంట్ ని గవర్నమెంట్ హాస్పిటల్ కి రిఫర్ చేయడం జరిగింది ఇక్కడ ట్రీట్మెంట్ ఆలస్యం అవుతుండడంతో మృతుడి బంధువులు గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించే లోపే అతను చనిపోవడం జరిగింది. కేవలం డబ్బుల కోసం ట్రీట్మెంట్ ఆపడం వల్లనే తన తండ్రి చనిపోయాడని మృతుని యొక్క కొడుకు సాయిలు ఆరోపించారు డబ్బుల కోసం వెళ్లానని తీసుకు వస్తానని చెప్పిన ట్రీట్మెంట్ చేయకుండా తన తండ్రి చావుకు ఆసుపత్రి యాజమాన్యం బాధ్యత వహించాలని ఆరోపించాడు. ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే తన తండ్రి చనిపోయాడు కాబట్టి దీనికి బాధ్యత వాళ్లే వహించాలని కోరాడు.

Akhand Bhoomi News

error: Content is protected !!