ప్రజావాణి సమస్యలు పరిష్కరించడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి కలెక్టర్…
 
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 18 (అఖండ భూమి న్యూస్) ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించడానికి అధిక ప్రాధాన్యత నివ్వాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ద్వారా జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి వారి సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఈ రోజు ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యల పరిష్కారానికి 69 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికార యంత్రాంగం పై విశ్వాసంతో ప్రజావాణి కార్యక్రమం ద్వారా తమ సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలు ఎంతో విశ్వాసంతో వారి సమస్యల పరిష్కారానికి దరఖాస్తులను అందజేస్తారని వాటిని ప్రతి ఒక్క శాఖ అధికారి ప్రత్యేకంగా పరిశీలించి సమస్య పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకొని రిపోర్ట్ ను కలెక్టరేట్ లో అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ చందర్, కలెక్టరేట్ ఏఓ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…


