ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు..

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు.. .

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 18 (అఖండ భూమి న్యూస్)

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ “సర్వాయి పాపన్న 1650లో వరంగల్ జిల్లా రఘునాథపాలెం మండలం, కిలాష్పూర్ గ్రామంలో జన్మించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి 1675లో సర్వాయిపేటలో రాజ్యం స్థాపించారు. గోల్కొండ కోటపై 12,000 మంది గెరిల్లా సైనికులతో దాడి చేసి, వరంగల్–భువనగిరి ప్రాంతాలను జయించారు. భువనగిరిని రాజధానిగా చేసుకొని 30 సంవత్సరాల పాటు పరిపాలించారు” అని వివరించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చందర్ నాయక్, డిబిసిడిఓ సయ్యద్ రఫీక్, అసిస్టెంట్ బిసిడిఓ చక్రధర్, గౌడ సంఘం నాయకులు రాజా గౌడ్, పల్లె రమేశ్ గౌడ్, తిరుమల గౌడ్, బహుజన నాయకులు కొత్తపల్లి మల్లయ్య, శివరాములు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!