ఆర్ముడు రిజర్వుడు పోలీసులకు హెల్మెట్ పై అవగాహన కార్యక్రమం.

 

 

ఆర్ముడు రిజర్వుడు పోలీసులకు హెల్మెట్ పై అవగాహన కార్యక్రమం.

జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ గారి ఆదేశాల మేరకు శనివారం ఎఆర్ డిఎస్పీ ఇలియాజ్ భాషా ఆధ్వర్యంలో కర్నూలు ఆర్ముడు రిజర్వుడు పోలీసులకు జిల్లా పోలీసు కార్యాలయంలో హైల్మెట్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సంధర్బంగా ఎఆర్ డిఎస్పీ ఇలియాజ్ భాషా మాట్లాడారు.బైక్ నడిపే సమయంలో పోలీసులు హెల్మెట్ లు ధరించి ఇతరులకు స్ఫూర్తి గా నిలవాలన్నారు. అతివేగంగా , మద్యం సేవించి, ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపకూడదని పలు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు సిబ్బందికి సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ , సురక్షితంగా గమ్యాలను చేరుకోవాలన్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలలో హెల్మెట్ లేకుండా బైక్ నడిపి వారు ప్రమాదాలకు గురైన విషయాన్ని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్ ఐలు వియస్ రమణ, పోతురాజు , శివారెడ్డి, ఆర్ ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!