వెల్దుర్తి మే 13 (అఖండ భూమి) :
మండల పరిధి రామళ్లకోట గ్రామంలోని పుల్లగుమ్మిపేటలో నివాసముంటున్న పరుశరాముడు కళ్యాణి దంపతుల రెండో కుమారుడు యల్లక్రిష్ణ (7) గ్రామ సమీపంలో గల రేగుల కుంటలో ప్రమాదవశాత్తు పడి మృతిచెందాడు. ఈ బాలుడు గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నట్లు తెలిసింది. ఇతను రెండో సంతానంగా ఉండడంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. తల్లితండ్రులు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని
పోషించుకుంటున్నారు. వీరు రోజువారిలాగే పొలంపనులకు వెళ్లగా ఇంటి వద్ద ఆడుకునే యల్లక్రిష్ణ పొలం వైపుకు వెళ్తున్నట్లు చుట్టుప్రక్కల వారు గమనించారు. పొలం వైపుకు వెళ్లే ఇతర పొలాల రైతులతో వెళ్లాడు. అయితే కుంట వద్ద జారి కుంటలో వడగా వారు చూసి వెంటనే కుంటలో దూకి కాపాడే ప్రయత్నం చేశారు. ఆ విద్యార్థిని బయటకు తీశారు. అప్పటికే అతను.
మృతిచెందినట్లు తెలిసింది. ఈ విషయాన్ని తల్లితండ్రులకు తెలుపగా వారు తమ కుమారుడి శవాన్ని ఇంటికి తీసుకొచ్చారు. ఉదయం నవ్వుతూ వెళ్లిరండి అమ్మ, నాన్న అని చెప్పిన కుమారుడు ఇలా అకాల మరణం చెందడంతో వారు జీర్ణించుకోలేక రోధిస్తున్న తీరు చూపరులను కంట తడి పెట్టించింది. వీరిని ప్రభుత్వం. అధికారులు ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



