వెల్దుర్తి మే 13 (అఖండ భూమి) : కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని వెల్దుర్తి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఖాదర్ బాషా అన్నారు. శనివారం స్థానిక మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయం నందు స్వీట్లు పంచుకొని కార్యకర్తలను ఉత్సాహం పరచడం జరిగింది. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రావడం ఖాయమని అన్నారు. బిజెపి ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ అధికంగా పెంచేసి ప్రజలను ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరి మద్దతు లేకుండా స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సంచనాత్మకంగా ప్రజలు తీర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ సద్వినియోగం చేస్తుందని తెలిపారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


