అంబేద్కర్ యువజన సంఘం సమావేశం

పటాన్చెరు మండల్,ఇస్నాపూర్ గ్రామ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సమావేశం

బండ రాజు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.

(పటాన్చెరు ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 18)

ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పంబల్ల దుర్గాప్రసాద్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పంబల్ల దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్క యువకుడు పని చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, రాజ్యాంగం లో కల్పించిన ప్రభుత్వాల లక్షలైన ఉచిత విద్య,వైద్యం, న్యాయాన్ని అన్ని వర్గాలకు అందే విధంగా అంబేద్కర్ యువజన సంఘం కృషి చేయాలని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వలు ప్రజలకు అందించాల్సిన ఉద్యోగం,ఉపాధి, ఇండ్లు,స్థలాలు, భూమి మౌలిక అవకాశాలను కల్పించే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని, అదేవిధంగా రాజ్యాంగం కల్పించిన హక్కుల, అవకాశాల పైన అవగాహన కలిగి ఉండాలని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని, సమాజం పట్ల బాధ్యతగా యువకులు నడుచుకునే విధంగా అంబేద్కర్ యువజన సంఘం పనిచేస్తుందని తెలుపడం జరిగింది.

ఈ సమావేశంలో ఇస్నాపూర్ గ్రామ నూతన కమిటీ

అంబేద్కర్ యువజన సంఘం

గౌరవ అధ్యక్షులు:- బండ రాజు

అధ్యక్షులు:- గంగుల శాముల్,

ఉపాధ్యక్షులు :- డప్పు విజయ్ కుమార్,

ప్రధాన కార్యదర్శి:- డప్పు పవన్ కళ్యాణ్,

కోశాధికారిగా :- ఎర్రోళ్ల రవికుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు పి.అశోక్ కుమార్,కె. సురేష్ కుమార్, ఇస్నాపూర్ గ్రామ పెద్దలు ఎర్రశివరాజ్,ఎర్ర కృష్ణ,బండశ్రీను మరియు అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!