కూలిన ఇల్లును పరిశీలించిన మాజీ జెడ్పిటిసి తిరుమల్ గౌడ్ 

కూలిన ఇల్లును పరిశీలించిన మాజీ జెడ్పిటిసి తిరుమల్ గౌడ్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి న్యూస్ ఆగస్టు 19(అఖండ భూమి న్యూస్

కామారెడ్డి జిల్లా దోమకొండ. ఇటీవలి కురిసిన వర్షాలకు దోమకొండలో కూలిపోయిన వైట్ల గంగవ్వ ఇంటిని మంగళవారం మాజీ జెడ్పిటిసి సభ్యుడు తిరుమల్ గౌడ్ పరిశీలించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ దృష్టికి తీసుకువెళ్లి ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో ఇల్లు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు.బాధిత కుటుంబ సభ్యులను వారు ఓదార్చారు. కూలిన ఇల్లు విషయమై తాసిల్దారు, గ్రామపంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినట్లు, రాకాపరంగా వారికి ఏదైనా వచ్చే ఆర్థిక సహాయాన్ని తొందరలో ఇవ్వాలని కోరారు. ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేయిస్తామని మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ ఇందిరమ్మ కమిటీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు అనంతరెడ్డి వారు భరోసా ఇచ్చారు.

Akhand Bhoomi News

error: Content is protected !!