యువతి, యువకులు హెచ్ఐవి /ఎయిడ్స్ పై అవగాహన కలిగి ఉండాలి…

డా// రాధిక ప్రోగ్రాం ఆఫీసర్ (ఎయిడ్స్ & లెప్రసీ)
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 19 (అఖండ భూమి న్యూస్)
యూత్ ఫెస్ట్ 2025 లో భాగంగా జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన దినోత్సవ సందర్భంగా మంగళవారం తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ లో 5K రెడ్ రన్ నిర్వహించడం జరిగింది. . ఈ సందర్భంగా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రాధిక మాట్లాడుతూ. యువతలో హెచ్ఐవి/ ఎయిడ్స్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని. అప్పుడే వారు దాన్ని బారిన పడకుండా ఉంటారని తెలియజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. అవగాహన కొరకు ప్రతి సంవత్సరం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగా విద్యార్థులకు రెడ్ రన్ (5కే) స్కూల్ విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఇందులో భాగంగా ఈరోజు కళాశాల విద్యార్థులకు సౌత్ క్యాంపస్లో 5K రెడ్ రన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ పోటీలలో పురుషుల విభాగంలో సౌత్ క్యాంపస్ కు చెందిన శ్రీకాంత్ పీజీ విద్యార్థి మొదటి స్థానం (క్యాష్ ప్రైజ్ 1000 రూపాయలు)అలాగే శ్రీశైలం
పీజీ విద్యార్థి రెండవ స్థానం (క్యాష్ ప్రైజ్ 500 రూపాయలు) అలాగే మహిళల విభాగంలో కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ చెందిన గడ్డం వార్ మమత, మొదటి స్థానం క్యాష్ ప్రైజ్ 1000 రూపాయలు) కుమ్మరి సింధు ద్వితీయ స్థానం (క్యాష్ ప్రైజ్ 500 రూపాయలు గెలుచుకోవడం జరిగింది. జరిగింది(ఇందులో సౌత్ క్యాంపస్ విద్యార్థులు, ఆర్కె డిగ్రీ కళాశాల, మంజీరా డిగ్రీ కళాశాల, ఎస్ ఆర్ కె డిగ్రీ కళాశాల మరియు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామారెడ్డి విద్యార్థులు పోటీలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ , హెచ్ ఓ డి సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ డాక్టర్ అంజయ్య , జిల్లా ఎయిడ్స్ నివారణ , నియంత్రణ ప్రోగ్రాం మేనేజర్ చల్ల.సుధాకర్ , స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, జ్యోతి, రాణి, దివ్య, రుచిత, బాలకృష్ణ, సాయి, క్యాంపస్ సిబ్బంది పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.
You may also like
ఏపీ పంచాయతీలో కీలక మార్పులు కార్యదర్శుల వర్గీకరణ ప్రమోషన్లు- జీవో జారీ..!
సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు*..l
నవీన్ యాదవ్ విజయమే ప్రజా ప్రభుత్వానికి దీవెనలు….
రైతాంగానికి అండగా నిలబడదాం..!
శిథిలావస్థలో ఉన్న పాఠశాల అదనపు గదుల కూల్చివేత పనులను పరిశీలించిన తిరుమల్ గౌడ్…


