ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు…

ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 19 (అఖండ భూమి న్యూస్)

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ఎల్లారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ , బీజేపీ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే మదన్ మోహన్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో మంగళవారం చేరారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ . “మదన్ మోహన్ నాయకత్వంలో గత 30 ఏళ్లుగా చూడని అభివృద్ధి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కేవలం 20 నెలల్లోనే సాధ్యమైంది. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న ఈ నియోజకవర్గంలో భాగస్వాములు కావాలని, ప్రజల సేవలో మదన్ మోహన్ తో కలిసి పనిచేయాలని, అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సెల్ జనరల్ సెక్రటరీ రఫీయుద్దీన్, మండల సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, సాయిరాం యాదవ్, సంగయ్య, దేవేందర్ రెడ్డి ,నాయకులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!