విశ్వ సాహితీ కళావేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రముఖ రచయిత జెట్టబోయిన శ్రీకాంత్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 23 (అఖండ భూమి న్యూస్)
సాహిత్య, సాంస్కృతిక, సేవా సంస్థ అయిన విశ్వ సాహితీ కళావేదిక కు తెలంగాణ రాష్ట్ర అధ్యకులుగా జెట్టబోయిన శ్రీకాంత్ గారిని సంస్థ చైర్మన్ కొల్లి రమావతి గారు గురువారం 21 ఆగస్ట్ రోజున నియమించడం జరిగింది.
కవితాశ్వమేధం పుస్తక రచయిత జాతీయవాది శ జెట్టబోయిన శ్రీకాంత్ ని తెలుగు గజల్ గాయకుడు, నటుడు, ఉద్యమకర్త 125 ప్రపంచ భాషలలో గజల్స్ పాడటం ద్వారా మూడు గిన్నీస్ ప్రపంచ రికార్డులు సాధించిన గజల్ శ్రీనివాస్ చేతుల మీదుగా సన్మానించి రమావతి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియామక పత్రం అందజేశారు.
ఈ నెల 17 వ తారీఖున ఆవిర్భవించిన నూతన సాహిత్య, సాంస్కృతిక, సేవా సంస్థ అయిన విశ్వ సాహితీ కళా వేదిక తెలుగు బాషా సంరక్షణ, సాహితీ విలువల సంస్థాపన ద్యేయంగా పనిచేస్తుందని కవులకు రచయితలకు ఇది ఒక అద్భుతమైన వేదిక అని శ్రీకాంత్ తెలిపారు.
శ్రీకాంత్ అనేక పాటలు, కవితలు, పద్యాలు, ప్రేరణ నిచ్చే రచనలు ఎన్నో రాశారు. ముఖ్యంగా శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదికకు శివశక్తి పవర్ఫుల్ సాంగ్ ఆన్ హిందూయిజం అనే భరతనాట్యనికి అనుగుణంగా గేయాన్ని రాయడంతో పాటు విశ్వహిందూ పరిషత్ కొరకు కాషాయపు కాంతికై సిద్ధమవ్వు హిందువా అంటూ అద్భుతమైన పాటలు రచించారు.
శ్రీకాంత్ సడలని సంకల్ప భలం, ఊహల ప్రతినిధి, తంగేడు పువ్వు, ఆకలి, ఎవరు నీవు, మూఢ నమ్మకాలు, లేత శ్రామికుడు, కంటి రెప్పలు, కాటేసే కాలం, నా నేటి తెలంగాణ, యుద్ద నౌకలు, వెంటాడే జ్ఞాపకాలు, నాన్న, ఇంకెన్ని రోజులు, మాంగల్యబందం, మత సామరస్యం, రైతుల ఆకలి కేకలు, సెల్యూట్ టు డాక్టర్స్, అమ్మకి ఆసరా, నవయుగ నారి, పేదోడి ప్రశ్న, ఆత్మహత్యలెందుకు, జర్రంత ఆలోచించు, తెలుగు వెలుగు, మహా భారతం వంటి అద్భుతమైన కవితలు రాసి ప్రముఖులచే ప్రశంసలు పొందారు. సమైక్య హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ద్వారా సమాజం లోని మానవ హక్కుల కోసం పోరాడుతున్నారు.
కామారెడ్డి జిల్లా, దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ కేవలం కవిత్వమే కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పాటలు పాడడం, చిత్రలేఖనం లో కూడా ప్రావీణ్యం సాధించారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం నిర్వహిస్తున్నారు. త్వరలో నాస్తికత్వమే నరరూప రాక్షసత్వం మరియు హైందవ సిందూరం అనే మరో రెండు పుస్తకాలు ఆవిష్కరించబోతున్నారని తెలిపారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…