- ఘనంగా కామారెడ్డిలో మున్సిపల్ 5 వ మహాసభ…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 24 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి మున్సిపల్ ఐదో మహాసభలు కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమానికి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి మున్సిపల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పాలడుగు భాస్కర్ , ఎస్ వి రమ సిఐటి రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్ , కామరెడ్డి సిఐటి జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని బతుకమ్మగుంటలో సుమారు 280 మందితో ఏకగ్రీవంగా ఈ మహాసభ జరిగింది. వాటర్ వర్క్స్ తో వివిధ విభాగాలతో అన్ని రకాల కార్మికులు పాల్గొన్నారు. మున్సిపల్ మున్సిపల్ కార్మికుల పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. మరణించిన కార్మికుల కుటుంబంలో మరియు 60 సంవత్సరాల నిండిన అనారోగ్యం బాగా లేక ఈ మధ్య పనిచేయలేని పరిస్థితిలో ఉన్న కార్మికులను తీసుకోవాలని కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించా
లని పిఎఫ్, ఈ ఎస్ ఐ జిల్లా కేంద్రంలో ఏఎస్ హాస్పిటల్ నిర్మించాలని డిమాండ్ చేశారు. సక్రమంగా కార్మికుల అకౌంట్లో జమ చేయాలని మున్సిపల్ రావాల్సిన అన్ని బెనిఫిట్స్ రావాలని ఈ మహాసభ నిర్ణయించింది మున్సిపల్ సమస్యలు పరిష్కరించడం కోసం మున్సిపల్ యూనియన్ గా సిఐటిగా ఎంతటి పోరాటగా సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.



