ప్రజావాణి సమస్యలను సత్వరమే పరిష్కరించాలి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 25 (అఖండ భూమి న్యూస్)
ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించి శనివారంలోగా వివరాలను అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో ప్రజావాణి కార్యక్రమం ద్వారా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నుండి ప్రజల నుండి వివిధ సమస్యలపై ఆర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై 92 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమం పై ప్రజలకు ఎంతో విశ్వాసం ఉందని అందుకు తగ్గట్టు వివిధ శాఖలకు అందిన ఆర్జీలను ఆయా శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పరిశీలించి శనివారంలోగా వివరాలను అందజేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ చందర్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…