హెచ్ఐవి ఎయిడ్స్, టీబీ అవగాహన పై జిల్లా స్థాయి క్విజ్ పోటీలు…

హెచ్ఐవి ఎయిడ్స్, టీబీ అవగాహన పై జిల్లా స్థాయి క్విజ్ పోటీలు…

కామారెడ్డి, జిల్లా ప్రతినిధి ; ఆగస్ట్ 25, (అఖండ భూమి న్యూస్)

జిల్లా వైద్య , ఆరోగ్య శాఖలోని ,జిల్లా ఎయిడ్స్ నివారణ , నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం పాఠశాల విద్యార్థులకు హెచ్ఐవి ఎయిడ్స్, టీబీ పై జిల్లా స్థాయి క్విజ్ పోటీలు

యూత్ ఫెస్ట్ లో భాగంగా జిల్లా ఎయిడ్స్ నివారణ ,నియంత్రణ సంస్థ, కామారెడ్డి జిల్లాలోని 8 ప్రభుత్వ పాఠశాల లో చదువుతున్న 9 వ , 10వ తరగతి విద్యార్థులకు హెచ్ఐవి ఎయిడ్స్, టిబి పై నిర్వహించారు.. ఇందులో మొదటి ప్రైజ్ (1000 రూపాయలు క్యాష్ ప్రైజ్), జెడ్పిహెచ్ఎస్ హనుమాన్ మందిర్ అక్షయ్ కుమార్, గౌస్ కు

ద్వితీయ స్థానం (500)రూపాయలు క్యాష్ ప్రైజ్) జడ్పీహెచ్ఎస్ దేవునిపల్లి కి చెందిన మీనాక్షి, మేఘన కు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ మేనేజర్ సుధాకర్, ఐ సి టి సి కౌన్సిలర్ నాగరాజు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సుధాకర్, జ్యోతి, స్రవంతి, వివిధ పాఠశాలల విద్యార్థులు, ఆయా పాఠశాల ఉపాధ్యాయులు,పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!