ఆశా కార్యకర్తలకు పీక్స్డు వేతనం 18 వేలు ఇవ్వాలని కలెక్టరేట్ ముందు ధర్నా…
పని భద్రత కల్పించాలని,
ఆరోగ్య బీమా పథకం అమలు చేయాలి..
పని వత్తిడి తగ్గించాలని
రిటైర్డ్ మెంట్ బెన్పిట్ అమలు చేయాలి..
కామారెడ్డి కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్ల ధర్నా ..
ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్స్ పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం ఆగదు ..
కందూరి చంద్రశేఖర్ సిఐటియు జిల్లా అధ్యక్షులు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 25 (అఖండ భూమి న్యూస్)
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశా కార్యకర్తలకు ఇచ్చిన 18 వేల పీక్స్డు వేతనం అందించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పారితోషికం పేరుతో కేంద్రం ప్రభుత్వం తెచ్చిన స్కీమ్ వర్కర్లలో ఆశా వర్కర్లు ఆరోగ్య కేంద్రాలలో పని చేసే ఇతర ఉద్యోగులకన్న ఎక్కువగా పని చేస్తున్నారని అన్నారు.ఉదయం ఆరుగంటల నుండి రాత్రి పడుకునే వరకు ఎప్పుడు ఎవ్వరికీ ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ముందుగా ఆశా వర్కర్లు ముందు ఉండాల్సిన పరిస్థితి ఉందన్నారు. గ్రామాలలో టిబి సర్వేలు, కుటుంబ సర్వేలు, డెంగీ కేసులు నమోదు, పెండ్లి అయ్యిన దగ్గర నుంచి టార్గెటెడ్ గా మొదటి రోజు నుంచి గర్భ నిర్దారణ వివరాలు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అధికారులకు సమాచారం అందించాల్సిన పరిస్థితి ఉందని అన్నారు.
కరోనా కస్ట కాలం లో ఆశా వర్కర్లు చేసిన సర్వీస్ కు అదనపు పారితోషికం ఇస్తామని చెప్పి నేటికి ఇవ్వలేదన్నారు. చాలి చాలని పారితోషికం తో కుటుంబాలు గడవక అప్పులు పాలు అవుతున్న ఆశా వర్కర్లు సుగర్, బీపీలు వచ్చి చనిపోయిన సందర్భాలు ఉన్నాయని అని ఆయన అన్నారు.
ప్రతీ ఆశ వర్కర్ల కు ఖచ్చితమైన వేతనం 18 వేలు ఇవ్వాలని, సవంత్సరానికి రెండు జతల యూనిఫాం ఇవ్వాలని, చనిపోయిన వారికి మట్టి ఖర్చుల కింద ఏబై వేలు ఇవ్వాలని, అర్హులైన వారికి ఏఎన్ఎం లుగా అవకాశం కల్పించాలని, రిటైర్డ్ మెంట్ బెన్పిట్ కింద పది లక్షల రూపాయలు ఇవ్వాలని, అర్హులైన వారికి ఆసరా పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుపేదలైనా ఆశా వర్కర్లకు
ఇంటి స్థలం తో పాటు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, ప్రభుత్వ పథకాలు వర్తింప చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ నెల చివరి నాటికి ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్స్ పరిష్కారం కాక పోతే సెప్టెంబర్ ఒకటవ తేదీన చలో అసెంబ్లీ కార్యక్రమం ఉంటుందని జిల్లా లో ప్రతి ఒక్క ఆశా కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని నెమ్మాది పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆశా వర్కర్ల సంఘం జిల్లా అధ్యక్షురాలు ఇందిరా, కార్యదర్శి రాజశ్రీ, జిల్లా నాయకులు రవీందర్, మమత, పద్మ ,మంజుల అనిత కృష్ణవేణి నాశ్రీన్ విజయ, ప్రమీల ,శశికళ, నాగమణి ,శారద ,సిద్ధవ, శాంత ,లావణ్య ,లలిత, గంగమణి, పల్లవి ,మణెమ్మ, సవిత ,శోభ , కామేశ్వరి, నాగరాణి ,మమత, తదితరులు పాల్గొన్నారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…