సౌత్ క్యాంపస్ లో కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ఎం ఎస్ ఎన్ ఫార్మా కంపెనీలో ప్రాంగణ నియామకాలు…

సౌత్ క్యాంపస్ లో కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ఎం ఎస్ ఎన్ ఫార్మా కంపెనీలో ప్రాంగణ నియామకాలు…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 25 (అఖండ భూమి న్యూస్)

తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణం కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ఎం ఎస్ ఎన్ (ఎం ఎస్ ఎన్ ఫార్మా) ఫార్మా కంపెనీలో ఉద్యోగాలకు ఈనెల 26న ప్రాంగణ నియామకాలు చేపడుతున్నట్టు కెమిస్ట్రీ విభాగం అధ్యక్షులు డాక్టర్ బి. సాయిలు తెలిపారు.

సౌత్ క్యాంపస్ లో ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగంలో 2022, 2023 ,2024 సంవత్సరాలలో పీజీ పూర్తి చేసిన విద్యార్థులు ఈ నియామకాలకు అర్హులు అని తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు తమ తమ నిజ ధ్రువీకరణ పత్రాలతో పాటు బయోడేటా మరియు ధ్రువీకరణ పత్రాల జిరాక్సు లు కూడా తీసుకొని 26 /8/ 2025న ఉదయం 11:30 గంటలకు సౌత్ క్యాంపస్ కెమిస్ట్రీ విభాగానికి రావాలని తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!