గణేష్ మండలి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చేతుల మీదుగా మట్టి గణపతుల పంపిణీ…

గణేష్ మండలి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చేతుల మీదుగా మట్టి గణపతుల పంపిణీ…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 26 (అఖండ భూమి న్యూస్)

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయము జనహిత గణేష్ మండలి 9వ వార్షికోత్సవమును పురస్కరించుకొని మంగళవారం రోజున జనహిత గణేష్ మండలి ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయము కార్యాలయ ఉద్యోగులకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై వారి చేతుల మీదుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయపు ఉద్యోగులకు మట్టి గణపతుల పంపిణీ చేశారు.

అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయము జనహిత గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమం చేపట్టాలని శుభాకాంక్షలు తెలుపుతూ పర్యావరణ హితమైన మట్టి గణపతి లను పూజించడం మంచి సాంప్రదాయమని జిల్లా ఉద్యోగులకు జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో.. కామారెడ్డి జిల్లా టీజీ ఈ జేఏసీ చైర్మన్ టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి,

కామారెడ్డి జిల్లా టీజీఏ జెఎసి ప్రధాన కార్యదర్శి జిల్లా టీజీవోస్ సంఘం అధ్యక్షులు దేవేందర్,

టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి ఎం నాగరాజు , కార్యవర్గ సభ్యులు,

టీజీఓస్ జిల్లా కార్యదర్శి సాయి రెడ్డి , వారి కార్యవర్గ సభ్యులు,

వివిధ శాఖల అధికారులు అధికారులు..

కామారెడ్డి

జిల్లా క్లాస్ ఫోర్ సంఘం కార్యవర్గ సభ్యులు,

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయము జనహిత గణేష్ మండలి కార్యవర్గ సభ్యులు,

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయపు ఉద్యోగులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!