బతుకమ్మ కుంట కాలనీ సహాయక చర్యల్లో టీపీసిసీ
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ముందుండి పర్యవేక్షణ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్ట్ 27 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి పట్టణంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో తీవ్ర ప్రభావానికి గురవుతోంది. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో కామారెడ్డి బతుకమ్మ కుంట కాలనీలోని జలమయం కాగా, రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పలు లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రజల పరిస్థితిని స్వయంగా పరిశీలించాలని భావించిన టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి , కామారెడ్డి,అన్ని మార్గాలు వరదల కారణంగా మూసివేయబడ్డాయి.
ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితులు చెప్పారు .ప్రజలకు తక్షణ సహాయక చర్యలు అందించేందుకు అధికారులను ఆదేశించడం జరిగింది.
“ఈ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వెంటనే స్పందించి ప్రజలకు సహాయం అందించాలి. మానవతా విధి మనందరి బాధ్యత. ప్రజల ప్రాణాలు, ఆస్తులు రక్షించడంలో ప్రతి ఒక్కరూ ముందుండాలి,” అని టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చిన ఫోన్ చేయాలన్నారు. అత్యవసరం కోసం నాలుగు అంబులెన్సులు, మూడు వాటర్ ట్యాంకర్లు, ఆహారం ఏర్పాటు చేసాం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ తాజా మున్సిపల్ చైర్పర్సన్, గడ్డం ఇందుప్రియ, మాజీ తాజా కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…