కామారెడ్డిలో ముంపు ప్రాంతాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ …

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 27 (అఖండ భూమి న్యూస్)
, గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ముంపుకు గురైన ప్రాంతాలను కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గురువారం పరిశీలించారు పట్టణంలోని జి ఆర్ కాలనీ గల ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించి బాధితులకు అండగా ఉంటానని ఓదార్చారు. ఇంటింటికి వెళ్లి వరద తీవ్రతను జరిగిన నష్టాన్ని బాధితులతో మాట్లాడి తెలుసుకున్నారు. అలాగే రామారెడ్డి రోడ్డులో గల టీచర్ కాలనీలో పర్యటించారు అక్కడ ఇంటింటికి వెళ్లి బాధితులతో వివరాలను తెలుసుకున్నారు. కామారెడ్డి వాగు పొంగి వంశమైన రోడ్లను కాలనీలను పరిశీలించారు. అక్కడి నుండి దేవునిపల్లి లో గల నిజాంసాగర్ రోడ్డులో దంసమైన రోడ్లను ముంపుకి గురైన ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట నాయకులు కామారెడ్డి పట్టణ పార్టీ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, కుంభాల రవి పార్టీ అధికార ప్రతినిధి బలవంతరావు, మాజీ కౌన్సిలర్లు ప్రభాకర్ యాదవ్, స్వామి, కృష్ణాజి రావు,, పాత హనుమాన్లు, భానుతో పాటు పలువురు పాల్గొన్నారు.
You may also like
2025 – 26 విండో నివేదిక మహాజనసభ…
బెల్లంపల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో అవయవ,నేత్ర,శరీర దానం పై అవగాహనా ర్యాలీ
జిల్లా కాంగ్రెస్ నాయకులను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు…
దోమకొండ ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గం త్వరలో ఏర్పాటు..!
కామారెడ్డి పేద ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ…


