తిమ్మాఫుర్ గ్రామంలో పర్యటించినా మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ…

తిమ్మాఫుర్ గ్రామంలో పర్యటించినా మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 27 (అఖండ భూమి న్యూస్)

ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలం లోని తిమ్మాపూర్ గ్రామంలో భారీ వర్షాలకు తిమ్మాపూర్ చేరువు కట్ట తెగిపోయినా విషయాన్ని తెలుసుకున్న ఎల్లారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ తిమ్మాపూర్ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా తిమ్మాఫుర్ వాగును పరిశీలించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ తో చారవణి తో మాట్లాడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ గ్రామస్తులకు భరోసా కల్పించారు. గ్రామస్తులను అన్ని విధాలుగా ఆదుకుంటామని పంట నష్టం జరిగిన వారికి అధికారులతో చర్చించి పంట నష్టపరిహారం వచ్చే విధంగా చేస్తామని రైతులెవరు అధైర్య పడద్దని తెలిపారు.చెరువు కట్ట మరమ్మతులు చేపట్టి త్వరగా పూర్తి చేస్తానని తెలిపారు. .మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ మాట్లాడుతూ. ఏ సమస్య ఉన్న ఫోన్ చేయాలని 24 గంటలు అందుబాటులో ఉంటామని గ్రామస్తులకు ధైర్యంగా ఉండాలని కోరారు. ఆయన వెంట తహశీల్దార్ ప్రేమ్ కుమార్,డిప్యూటీ తహసిల్దార్ శ్రీనివాస్, ఆర్ ఐ శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ సామెల్,మాజీ సొసైటీ చైర్మన్ బొండ్ల సాయిలు, ఎల్లారెడ్డి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజర్ ఖాద్రి, కాంగ్రెస్ నాయకులు సంతోష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు నర్సింహులు, తిమ్మాపూర్ గ్రామస్తులు మాజీ సర్పంచ్ రవి,శ్రీనివాస్ గౌడ్, సాయి బాబా,సంగమేశ్వర్,దుంపల లక్ష్మణ్, రత్నయ్య, శంకర్,గోపాల్,చెవ్వ గంగారాం, వినయ్, చాకలి సిద్దూ, గ్రామస్తులు ఉన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!