కామారెడ్డి జిల్లాలో వరదల ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 29 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లాలో వరదల ప్రభావిత ప్రాంతాలను జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ శుక్రవారం పర్యటించి, పరిస్థితిని సమీక్షించి అధికారులకు సూచనలు చేశారు.
భారీ వర్షాల కారణంగా దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని టేక్రియాల్ చెరువు, జాతీయ రహదారి 44 డ్యామేజ్ కావడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయమై జిల్లా ఎస్పీ స్వయంగా సందర్శించి, నేషనల్ హైవే అథారిటీ అధికారులతో మట్లాడి రహదారిని త్వరగా పునరుద్ధరించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొగ్గుగుడిశా–బాన్సువాడ రూట్, బొగ్గుగుడిశా–నిజాంసాగర్ రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నందున వాటిని పరిశీలించారు.
నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్న నీటి ప్రభావంతో చిన్న పూల్ బ్రిడ్జ్ వద్ద పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు.
వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాలని సూచించారు. తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత ఉన్నత అధికారులకు ఆదేశించారు.
అనంతరం నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. భారీ వర్షాల కారణంగా భవనం కొంతవరకు దెబ్బతినడంతో పాటు పరిసరాల్లో నీరు నిల్వ ఉన్న విషయాన్ని గమనించి, వెంటనే నీటిని తొలగించే చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.
నిజాంసాగర్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన సుమారు 78 మందిని గోర్గల్ పునరావాస కేంద్రంలో ఉంచగా ఎస్పీ వారిని కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారికి పండ్లు అందజేశారు. ఈ భారీ వర్షాలలో పోలీసుల సేవలను వారు ప్రశంసిస్తూ ఎన్నో ప్రాణాలు మీ చేతుల మీదుగా కాపాడబడ్డాయి” అంటూ అభినందించారు.
తడి హిప్పర్గా, చిన్న టాక్లి, పెద్ద టాక్లీ, సిర్పూర్, లింబూర్ గ్రామాల నుంచి సుమారు 250 మందిని మద్నూర్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి, అలాగే 150 మందిని డోంగ్లి ప్రభుత్వ పాఠశాలలో తరలించి వసతి కల్పించారు. ఈ కేంద్రాలను జిల్లా ఎస్పీ సందర్శించి బాధితులకు పండ్లు అందజేసి వారితో ముచ్చటించారు. మద్నూర్ పోలీసుల సేవలను యస్పి అభినందించారు.
అలాగే మద్నూర్ పోలీస్ స్టేషన్‌ను కూడా సందర్శించి స్థానిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
జిల్లా ఎస్పీ ప్రజలకు చేసిన ముఖ్య సూచనలు చేశారు.
వరద ప్రభావిత రహదారులపై ప్రయాణించే సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
రహదారి అంచులు, బ్రిడ్జ్‌లు లేదా నీరు ప్రవహిస్తున్న ప్రాంతాల వద్దకు వెళ్లకూడదు అన్నారు.
అధికారుల సూచనలు పాటిస్తూ, అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలి అన్నారు.
పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలు ఆందోళన చెందకూడదని ప్రభుత్వ యంత్రాంగలు అన్ని విధాలా ఏర్పాటు సహాయం అందిస్తుందని తెలిపారు.
ఏదైనా అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు వెంటనే స్థానిక పోలీసులకు లేదా కంట్రోల్ రూమ్ నెంబర్ 08468-220069 లేదా డయల్ 100 కు సమాచారం అందించాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…