సహాయక చర్యలు నిర్లక్ష్యం చేయకుండా బాధితులకు అండగా నిలవాలి… యు

సహాయక చర్యలు నిర్లక్ష్యం చేయకుండా బాధితులకు అండగా నిలవాలి…

 

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 29 (అఖండ భూమి న్యూస్)

కామారెడ్డి నియోజకవర్గంలో ఎడతెరపి లేకుండ కురుస్తున్న వర్షాల కారణంగా ఇబ్బంది పడుతున్న బిక్కనూరు, దోమకొండ, బీబీపేట, కామారెడ్డి పట్టణ ప్రాంతాలలో పర్యటించి ఎప్పటికప్పుడు అధికారులతో, రిస్కీ టీం లతో చర్చిస్తూ సహాయక చర్యలు ముమ్మరం చేయాలని కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి శుక్రవారం ఆదేశించారు. ఎమ్మెల్యే కె.వి.ఆర్ కామారెడ్డి పట్టణంతోపాటు దోమకొండ , బిబిపేట్, భిక్కనూర్ మండలాల్లో వరద బాధితుల గ్రామాలను సందర్శించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా పూర్తిస్థాయిలో సహాయక చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!