దోమకొండలో కూలిన ఇండ్లు రోడ్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు…

.రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ సూచనల మేరకు దోమకొండలో కూలిన ఇండ్లు రోడ్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 29 (అఖండ భూమి న్యూస్) కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో శుక్రవారం రోజున గత రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గ్రామములో సుమారు 30లో పాత ఇల్లు కూలిపోయినాయి. రోడ్లు దెబ్బతిన్నాయి వాటిని కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. దీనిపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి , రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ, ఇన్చార్జ్ మంత్రి సీతక్కకు , ప్రభుత్వము నుండి ఆదుకోవాలని సహాయ సహకారాలు అందించాలని కోరుతామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంతరెడ్డి, మాజీ జెడ్పిటిసి తిరుమలగౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్రబోయిన స్వామి, ,పట్టణ అధ్యక్షులు సీతారాం మధు ముదిరాజ్, తాటిపల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!