ముంపు ప్రాంతాలను పరిశీలించిన జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 28 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా కేంద్రంలో వరద బాధిత ప్రాంతాలను గురువారం జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ , ఎంపీ సురేష్ షెత్కర్ పరిశీలించారు. ఆయా కాలనీలలో నెలకొన్న సమస్యలు, ముంపు గురైన కాలనీలో పరిస్థితులు స్థితిగతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాతీయ రహదారి, కామారెడ్డి జిల్లాలో పలు ముంపు ప్రాంతాలపై అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని వారినీ ఓదార్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు , ప్రజలు పాల్గొన్నారు.


