సెప్టెంబర్ 2, మూడు తేదీలలో పీజీ ఇంటర్ గ్రేటెడ్ సెమిస్టర్ పరీక్షలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 30 (అఖండ భూమి న్యూస్)
ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు పీజీ ఇంటర్ గ్రేటెడ్ సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడినట్లు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సంపత్ కుమార్ శనివారం తెలిపారు. ఆగస్టులో 28, 29, 30 తేదీలలో నిర్వహించే పరీక్షలను వర్షాల కారణంగా వాయిదా వేసి సెప్టెంబర్ 2,3 తేదీలలో తిరిగి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు సంయోగం చేసుకోవాలని సూచించారు.