వరద బాధిత ప్రాంతాలను పరిశీలించిన మాజీ ఎంపీ బీబీ పటేల్…

వరద బాధిత ప్రాంతాలను పరిశీలించిన మాజీ ఎంపీ బీబీ పటేల్…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 30 (అఖండ భూమి న్యూస్)

మాజీ పార్లమెంట్ సభ్యులు బిబి పాటిల్ గారు పార్లమెంట్ పరిధిలోని ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో శనివారం పర్యటించారు.

బొగ్గు గుడిసె, అన్నా సాగర్ గ్రామాలకు సంబంధించిన వ్యాపారస్తులు తమ షాపులు పూర్తిగా ధ్వంసం అయిన వారికి ఆర్థిక సహాయం అందజేశారు.

కళ్యాణి ప్రాజెక్ట్ పూర్తిగా ధ్వంసం కావడంతో దాన్ని పరిశీలించడం జరిగింది

వెంకటాపూర్ ప్రధాన రహదారి కొట్టుకుపోవడంతో అక్కడ వెళ్లి ఇరిగేషన్ డిప్టీ గారితో తక్షణమే వారికి ప్రయాణానికి అనుకూలంగా మార్గం చేయాలని చెప్పడం జరిగింది.

ఎల్లారెడ్డి పట్టణంలో గాంధీ చౌక్ వద్ద కూలిన కటికే హుస్సేన్ ఇల్లును పరిశీలించడం జరిగింది.

తిమ్మాపూర్ గ్రామంలో చెరువు పూర్తిగా తెగిపోవడంతో చెరువు కట్టని పరిశీలించి గ్రామస్తులకు మనోధైర్యాన్ని ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మాజీ సెన్సార్ బోర్డు మెంబర్ రామకృష్ణ (ఆర్కె ) బిజెపి మండల అధ్యక్షులు నర్సింలు, సీనియర్ నాయకులు గంగాధర్, ప్యాలల రాములు, నరేష్ పికె, ప్రధాన కార్యదర్శి కుచులకంటి శంకర్, మహేందర్, అశోక్ ఉపాధ్యక్షులు జనముల పోచయ్య, సాయి రెడ్డి, లక్ష్మారెడ్డి, ఆంజనేయులు, నరసింహారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి గౌడ్, రాములు, వివిధ గ్రామస్తులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!