పోలీసుల సేవలు మరువలేనివి..

-మానవ హక్కుల సహాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సలీం.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు.30. (అఖండ భూమి న్యూస్)
పోలీసుల సేవలు మరువ లేనివని మానవ హక్కుల సహాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సలీమ్ అన్నారు. శనివారం హుమాన్ రైట్ హెల్ప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏఎస్పీ చైతన్య రెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు నిరంతరం రాత్రి అనక పగలనక కష్టపడి పని చేస్తున్నారన్నారు. పోలీసుల సేవలు మరువలేనివని ప్రజల కోసం నిరంతరం అండగా ఉంటూ పని చేస్తున్నారన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కామారెడ్డి పోలీసుల సేవలు అభినందనీయమన్నారు. పోలీస్ సేవలకు గాను పుష్పగుచ్చ మిచ్చి ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా అడ్వకేట్ ఈక శ్రీనివాసరావు ఏఎస్పీ చైతన్య రెడ్డిని ఆదర్శంగా తీసుకొని ప్రతి మహిళ దేశసేవకే ముందుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో హుమన్ రైట్స్ మహిళా చైర్మన్ షబానా, ఉమెన్ రైట్స్ రాష్ట్ర సలహాదారు కేతు రమణారెడ్డి, జోనల్ అధ్యక్షుడు ప్రదీప్, జిల్లా అధ్యక్షులు మోసర్ల శ్రీకాంత్ రెడ్డి, కామారెడ్డి మహిళా కార్యదర్శి సట్ల జమున, కార్యదర్శి అనిత, పట్టణ మహిళా అధ్యక్షురాలు అల్స బేగం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వి భాస్కర్, కార్యదర్శి షేక్ జావిద్ తదితరులు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


