లింగంపేట్ బ్రిడ్జిని 12 ఫీట్ల వెడల్పుతో మూడు కోట్ల రూపాయలతో

లింగంపేట్ బ్రిడ్జిని 12 ఫీట్ల వెడల్పుతో మూడు కోట్ల రూపాయలతో

కొత్త బ్రిడ్జిని నిర్మించాలి …

పోల్కంపేట్ గ్రామంలో తెగిన పెద్ద చెరువు కుంటలు మరమ్మత్తులు చేసి

రైతులకు పంట నష్టం ఎకరానికి 20,000 చొప్పున చెల్లించాలి..

సిపిఎం జిల్లా కార్యదర్శి కే. చంద్రశేఖర్..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 30 (అఖండ భూమి న్యూస్)

జిల్లాలో సిపిఎం పార్టీ జిల్లా బృందం లింగంపేట్ మండలంలోని లింగంపేట బ్రిడ్జి నిచేరుకొని తెగిపోయిన బ్రిడ్జిని శనివారం పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ. పాత బ్రిడ్జి ఐదు ఫీట్ల వెడల్పుతోని 100 సంవత్సరాల క్రితం నిర్మించింది అని ప్రస్తుతం తాత్కాలికంగా పనులు నడుస్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం వెంటనే మూడు కోట్ల రూపాయలు చెల్లించి 12 ఫీట్ల వెడల్పుతో కొత్త బ్రిడ్జిని నిర్మించాలని డిమాండ్ చేశారు. ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్తు తరాలకు ప్రజలకు ఇబ్బంది అవుతుందని ఆయన అన్నారు. అనంతరం పోల్కంపేట గ్రామాన్ని సందర్శించి తెగిపోయిన పెద్ద చెరువు చిన్న చెరువులను పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడడం జరిగింది. స్థానిక ఎమ్మార్వో ఎంపీడీవో లను గ్రామానికి పిలిచి జరిగిన నష్టాన్ని అంచనా వేసి పై అధికారులకు నివేదికలు అందించాలని కోరారు. స్పందించిన ఎమ్మార్వో సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పాడం జరిగింది. ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ,వర్గ సభ్యులు వెంకట్ గౌడ్ కొత్త నరసింహులు, నాయకులు మోహన్ ,గ్రామస్తులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!