బాలికల పాఠశాల-02లో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం

బాలికల పాఠశాల-02లో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం

సామాన్యులకు చేరువ చేయడంలో అయన కృషి ఎనలేనిది : హెచ్ఏం. బి. మంగమ్మ.

 

అనంతగిరి, అఖండ భూమి న్యూస్:

అల్లూరి జిల్లా, అనంతగిరి మండల కేంద్రంలో గల ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల-02లో ప్రధానోపాధ్యాయురాలు బి. మంగమ్మ ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా హెచ్ ఏం. బి. మంగమ్మ మాట్లాడుతూ ఈరోజు తెలుగు కవులలో గొప్ప కవి గిడుగు వెంకట రామమూర్తి జయంతి అని అన్నారు,ఆయను తెలుగు భాషాకు చేసిన సేవలను గౌరవించుకోవటానికి ఆగస్టు 29న తెలుగు దినోత్సవం జరుపుకుంటారనీ తెలిపారు. ఈ తెలుగు భాషా గొప్ప తనాన్ని దాని ప్రాముఖ్యతను అను బంధాన్ని గుర్తు చేసుకోవాలన్నారు,గిడుగు వెంకట రామమూర్తి ఆధునిక తెలుగు భాషా కు చేసిన సేవలను ప్రాముఖ్యతని అతను చేసిన కృషి ని అయన చేసిన మార్పులు తెలుగు బాషా ను సామాన్యులకు దగ్గర చేసాయన్నారు,అలాగే తెలుగు భాషా గొప్ప చరిత్ర సంస్కృతిని కలిగి ఉందని సౌందర్యని మెచ్చుకోవాలనీ నేటి తరానికి తెలుగు భాషా సంప్రదాయాలతో అనుసరించడానికి ఈ దినోత్సవం ముఖ్య మని అన్నారు.అనంతరం పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమలు సాహిత్య పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల టీచర్స్,అలాగే పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!