జి ఆర్ కాలనీలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమాలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 31 (అఖండ భూమి న్యూస్)
ఎడతెరిపి లేకుండా వర్షాల కారణంగా కామారెడ్డి లోని జి ఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఇళ్లన్నీ బురదమయం కావడం వలన ఆదివారం రోటరీ క్లబ్ , వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇళ్లను శుభ్రపరచడంలో వారికి ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సహాయం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి క్లీన్ చేస్తూ వారికి అండగా ఉన్నామని చెప్పి ,సపోర్ట్ చేస్తూ అలాగే మధ్యాహ్నం అక్కడున్న వారందరికీ భోజన వసతి కల్పించారు. కామారెడ్డి కలెక్టర్ అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రోటరీ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి మాట్లాడుతూ. విపత్కర సమయంలో రోటరీ క్లబ్ ముందుంటుందని తెలియజేస్తూ కామారెడ్డి లో ఇప్పటివరకు ఇలా జరగలేదని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని అందిస్తూ ముందుకెళ్లడం జరిగింది.ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ , ఆర్కె విద్యా సంస్థల ప్రతినిధులు ,వివిధ సంస్థలు , రోటరీ అధ్యక్షులు శంకర్, సెక్రటరీ సబ్బని కృష్ణ హరి, ట్రెజరర్ వెంకట రమణ, రోటరీ మెంబర్స్ రాజనర్సింహారెడ్డి,సుధాకర్,బాలకిషన్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సుధాకర్ రావు,శ్యామ్ గోపాల్, నాగరాజు ,నవీన్ కుమార్, గిరిగంటి లక్ష్మీనారాయణ,ఆర్మీ కోచ్ రాజేష్ వాలంటీర్స్ , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…