బీసీలకు 52 శాతం ఎమ్మెల్యే ఎంపీలను చట్టసభల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి…
భారతదేశ ప్రజల తలరాతలను మార్చేది చట్టసభలులోనే..
బహుజన్ సమాజ్ పార్టీ ఎల్లారెడ్డి అసెంబ్లీ అధ్యక్షులు మర్లు సాయిబాబు ..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 30 (అఖండ భూమి న్యూస్)
స్థానిక సంస్థ ఎన్నికలలో 42% బి సి రిజర్వేషన్ ఇవ్వడం వల్ల బీసీల అభివృద్ధికి ఎలాంటి అవకాశం లేదని అసలు రిజర్వేషన్ చట్టసభల్లో అమలు చేయాలని బహుజన సమాజ్ పార్టీ ఎల్లారెడ్డి అసెంబ్లీ అధ్యక్షులు సాయి బాబా డిమాండ్ చేశారు. శనివారం ఈ సందర్భంగా మాట్లాడుతూ. బీసీలు 52%కు పైగా ఉన్నందున 42% కాకుండా, 52 శాతం జనాభా గల బీసీలకు రిజర్వేషన్ కల్పించడం వల్లనే సమస్యకు సమాధానం దొరుకుతుంది అన్నారు. స్థానిక సంస్థ ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్ కల్పించడం అనేది ఒక బూటకం.ఈరోజు స్థానిక సంస్థలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వలు ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాము. కాబట్టి స్థానిక సంస్థలకు రిజర్వేషన్ కాదు చట్ట సభలకు రిజర్వేషన్ వర్తింపజేయాలన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ పుణ్యమ ఎస్సీ ,ఎస్టీలకు చట్టసభల్లో రిజర్వేషన్ వచ్చింది కానీ ఇప్పటివరకు 52శాతమున్న బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కలిగించకపోవడం అనేది నిజంగా ఈ భారత దేశంలోనీ బహుజనులకు అన్యాయం జరుగుతుందన్నారు..మన పోరాటం చట్టసభల్లో అసెంబ్లీ పార్లమెంటులలో 52 శాతం రిజర్వేషన్ కోసం పోరాటం చెయ్యలే గాని స్థానిక సంస్థలో రిజర్వేషన్ కోసం కాదు అన్నారు. బీసీ నాయకులు, మేధావులు, విద్యవంతులు ఈ విషయం పైన ఆలోచించి స్పందించాలి ఐక్యంగా ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. అప్పుడే బీసీ సమాజానికి న్యాయం జరుగుతుందనీ బీఎస్పీ వ్యవస్థాపకులు కాన్షిరాం పోరాట ఫలితంగా మండల కమిషన్ అమలైంది అని గుర్తు చేశారు. ప్రస్తుతం “మండల కమిషన్ అమలు కరో వర్ణ కుర్చీ కాళీ కరో” అనే నివాదం ఇచ్చి యావత్ భారతదేశాన్ని కదిలించారు. తత్పలితంగా బీసీలకు విద్యా ఉద్యోగలలో 27% రిజర్వేషన్ అమలైంది. ఈరోజు అలాంటి చారిత్రాత్మకమైన పోరాటం కావాలి. మా హక్కులు మేము పొందాలంటే మాకు కావాల్సింది చట్టసభల్లో రిజర్వేషన్లు “మేము ఎంతో మాకు అంత” వాటా కావాలన్నారు. అది చేసినప్పుడే బీసీలకు సరైన న్యాయం జరిగినట్టు. భారతదేశంలోనే రాజ్యాంగం మే మేనిఫెస్టోగా గల పార్టీ బహుజన సమాజ్ పార్టీ మాత్రమే, రాజ్యాంగం అమలు చేసే అందరికీ సమానంగా చట్టాలను అమలు చేసే పార్టీ బీఎస్పీ పార్టీ మాత్రమే అన్నారు.
You may also like
2025 – 26 విండో నివేదిక మహాజనసభ…
బెల్లంపల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో అవయవ,నేత్ర,శరీర దానం పై అవగాహనా ర్యాలీ
జిల్లా కాంగ్రెస్ నాయకులను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు…
దోమకొండ ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గం త్వరలో ఏర్పాటు..!
కామారెడ్డి పేద ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ…



