పంట నష్టపోయిన ప్రతి ఎకరానికి 25 వేల రూపాయల చొప్పున పరిహారం అందించాలి…
కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్..
ఇటీవల జిల్లా కేంద్రంలో కురిసిన భారీ వర్షాలకు వరదలపై మాజీ ఎమ్మెల్యే గంప గోవర్దన్ మీడియా సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గంప గోవర్దన్ మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు పర్యటనలు, పరామర్శలు ముఖ్యం కాదు, సహాయం చేయడం, వారిని అందుకోవడం ముఖ్యంమని అన్నారు. భారీ వర్షాలులకు కామారెడ్డినియోజకవర్గంలో నాలుగు మంది చనిపోయారని అన్నారు. వాతావరణ శాఖ, అధికారులు ముందస్తుగా చర్యలు తీసుకుని ఉంటే ఇంత ఘోరం, ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదని అన్నారు. వరద బాధిత కుటుంబాలకు కనీసం పునరావాసం కల్పించలేదని అన్నారు. మంత్రి సీతక్క తూతూ మంత్రంగా వరద బాధిత ప్రాంతంలో పర్యటించారు. వారికి ఎలాంటి సహాయం చేయలేదని అన్నారు. జిల్లా కలెక్టర్ ఒక్కో కుటుంబానికి చేసిన 11,500 రూపాయల సహాయం బాధిత కుటుంబాలకు ఏమాత్రం సరిపోతుందని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పంట నష్టం చాలా జరిగిందని, పంట నష్టం జరిగిన ప్రతి ఎకరాకు 25 వేల రూపాయల నష్ట పరిహారం అందజేసి రైతులకు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నియోజికవర్గంలో పెద్ద ఎత్తున ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ శాఖ రోడ్లకు నష్టం జరిగిందని, వాటిని యుద్ధప్రాతిపదికన నిర్మించాలని అన్నారు. నిన్న మీడియా సమావేశంలో మాట్లాడిన స్థానిక ఎమ్మెల్యే రమణా రెడ్డి ప్రజల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదని, స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి రమణా రెడ్డి ఓ ప్రజా ప్రతినిధి గా అలా మాట్లాడకూడదని అన్నారు. ప్రజా ప్రతినిధి తనకు చేతనైన సహాయం చేయాలి తప్ప బాధితులదే తప్పని మాట్లాడడం సరైంది కాదని అన్నారు. కామారెడ్డి పెద్ద చెరువు అలుగు ప్రాంతం బఫర్ జోన్లో ఇళ్లకు అనుమతులు ఇవ్వడం అధికారులదే తప్పని అన్నారు. బాధిత కుటుంబాలకు బి ఆర్ ఎస్ పార్టీ అండగా ఉంటుంది, వారికి మా పార్టీ తరపున చేతనైన సహాయం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ నాయకులు నల్లవెల్లి అశోక్, కుంభాల రవి, పట్టణ పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, అధికార ప్రతినిధి బలవంత రావు, మాజీ ఎంపీపీ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.