సౌత్ క్యాంపస్ విద్యార్థి ప్రతిష్టాత్మక జె ఎన్ యు( జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ) లో పరిశోధక విద్యార్థిగా ఎంపిక…

సౌత్ క్యాంపస్ విద్యార్థి ప్రతిష్టాత్మక జె ఎన్ యు( జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ) లో పరిశోధక విద్యార్థిగా ఎంపిక…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 2 (అఖండ భూమి న్యూస్)

తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ కెమిస్ట్రీ విభాగంలో పీజీ పూర్తి చేసిన ఎల్ శశి కుమార్ అనే విద్యార్థి ప్రతిష్టాత్మక సి ఎస్ ఐ ఆర్ నెట్ లో ఉత్తీర్ణత సాధించి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం అయినా జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో పరిశోధనకు ఎంపికయ్యారు. అని కెమిస్ట్రీ విభాగం అధిపతి డాక్టర్ బి సాయిలు తెలిపారు శశి కుమార్ మారుమూల ప్రాంతమైన గంగ్యా తండా నల్లగొండ జిల్లా కు చెందిన విద్యార్థి అని తెలిపారు. శశికుమార్ నిరుపేద కూలీ కుటుంబానికి చెందిన వాడు ,ఇంటర్ మిర్యాలగూడలో,డిగ్రీ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లో డిగ్రీ చదివారు.

మారుమూల ప్రాంతం నుండి ఢిల్లీ లోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో పరిశోధన విద్యార్థిగా ఎంపిక కావటం గొప్ప విషయమని ఆయనను కెమిస్ట్రీ విభాగం అధ్యాపకులు,ప్రిన్సిపల్ డా.సుధాకర్ గౌడ్,అధ్యాపకులు అభినందించారు. ఇదే స్పూర్తిగా మిగతా విద్యార్థులు బాగా చదవాలని ప్రిన్సిపల్ డా.సుధాకర్ గౌడ్ పిలుపునిచ్చారు.

Akhand Bhoomi News

error: Content is protected !!