నవ చైతన్య యూత్ క్లబ్ వినాయకుని దర్శించుకున్న మావి జడ్పిటిసి తిరుమలగౌడ్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 2 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని శ్రీ నవ చైతన్య యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపాన్ని దోమకొండ మాజీ జడ్పిటిసి సభ్యులు తీగల తిరుమల గౌడ్ మంగళవారం సందర్శించారు. వినాయకుని కి. మొక్కులు చెల్లించి తన కోరికలను తీర్చమని వినాయకుని వేడుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాద వినియోగంతో పాటు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ నవచైతన్య యూత్ క్లబ్ ప్రతినిధులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.