బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో …

బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో …

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 2 (అఖండ భూమి న్యూస్);

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే గంపగోవర్ధన్, బి ఆర్ ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అద్యక్షులు యంకె ముజీబోద్దీన్ నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలోని 25 మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా , రస్తా రోకో కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు , జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కెసిఆర్ పైన చేస్తున్న కుట్ర మాత్రమే కాదు….తెలంగాణ నదీ జలాలను పక్క రాష్ట్రాలకు తరలించి,కాలేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయత్నంలో భాగంగానే జరుగుతున్నది అన్నారు.

సిబిఐకి కాలేశ్వరం అప్పజెప్పడం అంటే పూర్తిగా ప్రాజెక్టును మూసేయడమే

నిన్నటిదాకా సిబిఐ పైన వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్కరోజులోనే మాట ఎందుకు మార్చాడు. తెలంగాణా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐ కి అప్పజెప్పడం వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు.లేదంటేమున్ముందు ధర్నా కార్యక్రమాలు ఇంకా ఉదృతం చేస్తామని హెచ్చరించారు. బెదిరింపులు కేసులు మా పార్టీకి కొత్త కాదని అన్నారు.

ఒక వైపు రైతులు పంటలకు యూరియా లేక అల్లాడిపోతుంటే వారి గురించి పట్టించుకునే వారే కరువయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!