ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు…

ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు…

 

కామారెడ్డి సెప్టెంబర్ 2( అఖండ భూమి న్యూస్)

నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జనసేన అధినేత ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా ఇన్చార్జి గుండా సంతోష్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ రక్తదాన శిబిరంలో 52 మంది జనసేన కార్యకర్తలు రక్తదానం చేశారు గోల్ హనుమాన్ దేవాలయం లో పవన్ కళ్యాణ్ పేరిట అర్చన ప్రత్యేక అభిషేకాలు చేశారు అనంతరం స్నేహ సొసైటీలో 1500 మంది పిల్లలకు అన్నదానం చేశారు జనసేన పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు బోధన్ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వాసుపత్రిలో పండ్ల పంపిణీ కార్యక్రమం చేశారు బాన్సువాడ పట్టణంలో మొక్కలు నాటి అభిమానాన్ని చాటుకున్నారు ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేశారు కామారెడ్డి జిల్లా కేంద్రంలో రోగులకు పాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ యువత జిల్లా అధ్యక్షులు నవీన్ జనసేన పార్టీ నాయకులు షాదుల్లా శ్రీనివాస్ గోపి రవి అజయ్ తోపాటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ మల్లేష్ పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!