కామారెడ్డి లో పడ్డ వర్షం ఏమిటి..?
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 2,(అఖండ భూమి న్యూస్) మాములు వర్షపాతం,అల్పపీడనం అనే మాటలు విని ఉంటాం. కానీ మేఘాల ధ్వంసం క్లౌడ్ బ్లాస్టింగ్ అనేది మనం ఈమధ్య వింటు న్నాం. మేఘాల ధ్వంసం అంటే ఏమిటి? ఇది ఒక ప్రకృతి “విప త్తు” ఇది తక్కువ సమయంలో ఒక ప్రాంతంలో 1000 మిల్లీ మీటర్లు లేదా 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం పడి తే దాన్ని క్లౌడ్ బ్లాస్ట్ అంటారు. ఇది ఎందుకు ఏర్పడుతుంది. వాయుమండలంలో తేమ అధికమవడం, గాలుల ప్రవాహంలో మార్పులు మేఘాలు ఒకే చోట కదలకుండా ఉండడం, హిమాలయ ప్రాంతాలు ఉత్తర భారత దేశం మరియు కొన్ని గిరిజన ప్రాంతాల్లో ఇది కనిపిస్తుంది. వాతావరణం లో ఉష్ణోగ్రతలో ఆకస్మాత్తుగా మార్పులు రావ డం వల్ల, వాతావరణంలో తేనె ఎక్కువ కావడం తక్కువ పీడ న ప్రాంతాలు ఏర్పడినప్పుడు, తేమతో కూడిన గాలులు ఎక్కువ వర్షాన్ని కురిపిస్తాయి. కామారెడ్డి జిల్లా రాజంపేటలో 49.48 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. దీనికి పర్యావరణ కారణాలు కూడా కారణం చేస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్ కారణంగా గాలి ఎక్కువ నీటి ఆవిరితో నిండి ఉంటుంది. హిమాలయాలు వంటి పర్వతా లు మాన్సున్ గాలులను అడ్డు కోవడంతో భారీ వర్షపాతం జరుగుతుంది. అడవులు తగ్గిపోవడంతో వర్షపు నీటిని నేల శోషించకపోవడం, జంతు వులు పక్షులని వాసాలు నశించడం దీనికి కారణం కామారెడ్డి లో క్లౌడ్ బ్లాస్టింగ్ వల్ల 48 సెంటీమీటర్లు లేదా 400 మిల్లీ మీటర్ల పైగా వర్షపాతం నమోదయింది.10 మండలాల్లో 200 మిల్లీ మీటర్లు కొన్ని ప్రాంతాల్లో 300 మిల్లీ మీటర్లు నమోదయింది1.82 లక్షల క్యూసెక్కుల సామర్ధ్యం గల పోచారం ప్రాజెక్ట్ మాక్సిమం వరద నీటిని 70 వేల క్యూసెక్కులుగా విడుదల చేశారు. అయినా పోచారం ప్రాజెక్టు కొంత కూడా నష్టం కలగలేదు. ప్రజలు కూడా ఆలోచించాలి రియల్ ఎస్టేట్ దందా పేరుతో కాలువల పక్క న చెరువుల పక్కన ఇల్లు నిర్మించుకోవద్దు. ప్రకృతి మన చేతుల్లో లేదు. కామారెడ్డిలో అపర ఆర్థిక నష్టం తో పాటు ప్రాణ నష్టం పంటలు నష్టం జరిగింది. పర్యావరణాన్ని కాపాడే బాధ్యత మన అందరిదీ.