సంక్షేమ పథకాల దివంగత నేత సృష్టికర్త వైయస్సార్..

సంక్షేమ పథకాల దివంగత నేత సృష్టికర్త వైయస్సార్..

పుల్లల చెరువు అఖండ భూమి సెప్టెంబర్ 2 న్యూస్

రాష్ట్రంలోనే కాదు దేశంలో సైతం ప్రస్తుతం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథక సృష్టికర్తగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి చరిత్రలో నిలిచారని పుల్లలచెరువు మండల ఐసిపి కన్వీనర్ దోమకాల వెంకటేశ్వర్లు అన్నారు. దివంగత వైయస్సార్ 16వ వర్ధంతి సందర్భంగా పట్టణంలో వైఎస్ఆర్ సీపీ శ్రేణులు శాసనసభ్యులు తాడిపత్రి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు కార్యక్రమాలు చేపట్టారు. మండల మరియు పట్టణ నాయకులు చేపట్టారు. ముందుగా పార్టీ ఆఫీస్ నుండి వైయస్సార్ సెంటర్ వరకు పాదయాత్ర చేపట్టారు. దివంగత వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం మండల కన్వీనర్ దోమకాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశంలో పలు రాష్ట్రాలకు ఆదర్శవంతంగా నిలిచిన ఏకైక నాయకుడు దివంగత వైఎస్సార్ మాత్రమే అన్నారు. ఆయన చూపిన అడుగుజాడలలోని జగనన్న పలు సంక్షేమ పథకాలను అమలు చేశారని ప్రస్తుత ప్రభుత్వాలు సైతం ఆయన చూపిన మార్గంలోని నడుస్తున్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే అన్నారు. రాష్ట్రంలో మనం ఓటమి చెందిన మని వారు మాట్లాడుతున్నారని కానీ ఓటమి చెందింది మనం మాత్రం కాదని భవిష్యత్తులో వారికి త్వరలోనే తెలుస్తుంది అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం జల యుద్ధం పేరిట ప్రాజెక్టులను పూర్తి చేసి మారుమూల ప్రాంతాలకు సైతం నీటిని విడుదల చేసిన అపర భగీరథుడు వైఎస్ఆర్ మాత్రమే అన్నారు. రూపాయికి కిలో బియ్యం ఆరోగ్యశ్రీ విద్యార్థులకు స్కాలర్షిప్ ఒకటి కాదు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ సుపరిచితమైన ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేసిన ఘనత వైయస్ కుటుంబానికి మాత్రమే దొరుకుతుందన్నారు. రాష్ట్రంలోని ప్రజలంతా తమ గృహాలలో దేవుని విగ్రహాలతో పాటు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఫోటోలు సైతం పెట్టి పూజిస్తున్నారంటే రాష్ట్ర ప్రజలలో వైయస్సార్ వైయస్సార్ కుటుంబానికి ఉన్న విధేయత అర్థం అవుతుందన్నారు. భవిష్యత్తులో మన ప్రభుత్వం అధికారం చేపట్టడం ఖాయమని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లింగంగుంట్ల రాములు

చాపల మడుగు సర్పంచ్ తమ్మినేని.సత్యనారాయణరెడ్డి. పుల్లలచెరువు మండల కన్వీనర్ దోమకాలు వెంకటేశ్వర్లు .నాయుడు పాలెం సర్పంచ్ ఆవుల కోటిరెడ్డీ, వైసీపీ రాష్ట్ర పంచాయతీ వింగ్ భూమిరెడ్డి సుబ్బారెడ్డి, మల్లపాలెం సర్పంచ్ రమణారెడ్డి, వైసీపీ ప్రకాశం జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ కోర్లకుంట జానకీ రఘు, యర్రగొండపాలెం కన్వీనర్ ముసలరెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!