రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలవాలి…

గణేష్ మండపాలను ఏర్పాటు చేసిన యువత రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలవాలి…

 

గణేష్ మండపాల వద్ద రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం..

ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 3 (అఖండ భూమి న్యూస్);

 

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా యువత గణేష్ మండపాలను ఏర్పాటు చేసి వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాయని , ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేయడం కోసం,తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలవాలని జిల్లా వ్యాప్తంగా ఉన్న గణేష్ మండపాల నిర్వాహకులను యువతను ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు విజ్ఞప్తి చేశారు.

 

ఈ సందర్భంగా డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ హైమద్ లు మాట్లాడుతూ యువత రక్తదానం పట్ల అవగాహనను పెంపొందించుకోవాలని రక్తదానం చేయడం అంటే ఇతరుల ప్రాణాలను కాపాడడం మాత్రమే కాకుండా మన ప్రాణాలను కూడా కాపాడుకోవడమే అనే విషయాన్ని యువత గుర్తించాలని అన్నారు.రక్తదానం చేసే వారిలో గుండె జబ్బు క్యాన్సర్ కొలెస్ట్రాల్ వంటి వ్యాధులు రావని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేయడం జరిగిందని అన్నారు.

 

18 సంవత్సరాలు నిండిన ఆరోగ్యవంతులైన యువత రక్తదానం చేయడానికి అవకాశం ఉంటుందని గణేష్ మండపాలను ఏర్పాటు చేసిన యువజన సంఘాలు యువత రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని,కనీసం 30 మంది రక్తదాతలు ఉన్నట్లయితే రక్తదాన శిబిరాలను వారి యొక్క గణేష్ మండపం వద్దనే ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రక్తదానం చేసిన వారికి ప్రశంస పత్రాలను వారి యొక్క యువజన సంఘాల పేరు మీద ఇవ్వడానికి కామారెడ్డి రక్తదాతల సమూహం,ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవిఎఫ్,ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలనుకునే గణేష్ మండపాల నిర్వాహకులు 9492874006,88973 49872 నెంబర్లకు సంప్రదించాలని అన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!