దోమకొండ ఊరడమ్మ వీధిలో శానిటేషన్ కార్యక్రమం

దోమకొండ ఊరడమ్మ వీధిలో

మురికి కాలువలు చెత్తాచెదారాన్ని పరిశుభ్రత చేయించిన ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ మాజీ జడ్పిటిసి తీగల తిరుమల గౌడ్.

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; సెప్టెంబర్ 3 (అఖండ భూమి న్యూస్.)

కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని ఊరడమ్మ వీధిలో గత వారం రోజుల క్రితం భారీ వర్షాలు కురవడం వల్ల మురికి కాల్వలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని బుధవారం జిపి సిబ్బందితో పరిశుభ్రత చేయించిన ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ వారి వెంట మాజీ జడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ లు పనులను పరిశీలించారు. ఇండ్లు కూలిపోవడం ఇంటిలోకి నీరు వచ్చడం ద్వారా ఇల్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు ఇవ్వాలని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ కు ఇందిరమ్మ కమిటీ మెంబర్ సీతారాం మధుకు వినతి పత్రం కాలనీవాసులు అందజేశారు. అదే గల్లీలో వినాయకుని ఏర్పాటు చేయడం ద్వారా ఆ వినాయకుని దర్శించుకున్న ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సీతారo మధు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు .

Akhand Bhoomi News

error: Content is protected !!