పోడు భూముల పట్టాలకు బ్యాంకు రుణాలు అందించాలి…

పోడు భూముల పట్టాలకు బ్యాంకు రుణాలు అందించాలి…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 3 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో పోడు భూమి పట్టాలకు బ్యాంకు రుణాలు ఇవ్వాలని బుధవారం రాస్తారోకో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు మోతిరాం నాయక్ కార్యదర్శి ప్రకాష్ నాయక్ అఖిలపక్షం నాయకులు శంకర్ నాయక్ రవీందర్ నాయక్ బి శంకర్ నాయక్ దేవి నాయక్ వసంత్ నాయక్ అమర్ సింగ్ నాయక్ గణేష్ నాయక్ సంతోష్ నాయక్ రమేష్ నాయక్ లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. భూములకు రుణాలు ఇవ్వాలని ఆరు మాసాల నుంచి బ్యాంకుల చుట్టూ కలెక్టర్ల చుట్టూ తిరిగిన ఫలితం రాలేకపోయింది ఉన్నారు. పంట పెట్టుబడి కోసం దళారులకు అశ్రయించి మూడు రూపాల వడ్డీతో పేద రైతులు నష్టపోతారు అన్నారు. బ్యాంక్ అధికారులు పట్టింపు లేకుండా పోయిందని అన్నారు వెంటనే బ్యాంకు మేనేజర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందనీ బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ. వారం రోజుల్లోనే మీకు రుణాలు అంతే విధంగా చూస్తానని మాట హామీ ఇచ్చారు. ఒకవేళ వారంలో ప్రారంభించక పోతే కామారెడ్డి జిల్లా కలెక్టర్ ను దిగ్భంధం చేస్తామని నాయకులు తమ డిమాండ్ పత్రాన్ని బ్యాంకు మేనేజర్ ని ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో పోడు రైతులు కూలీలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!