శ్రీ రామసేవా సమితి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసరాల సరకుల పంపిణీ..
.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 3 (అఖండ భూమి న్యూస్);
గత వారం రాజంపేట్ మండలం ఎల్లాపూర్ తండాలో భారీ వర్ష బీభత్సంతో అ తండా మొత్తం వరద నీటితో నష్టపోయిన గిరిజన లంబాడి కుటుంబాలకు బుధవారం శ్రీ రామ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఎల్లాపూర్ తండాలో వరద బాధితులకు సహాయార్థము తండాలోని 175 కుటుంబాలకు నిత్యావసర సరకులు బియ్యం, కిరాణాం సరుకులు సుమారుగా 1,05,000/- లక్ష అయిదు వేల రూపాయల విలువ గల సరుకులను వరద బాధితులకు పంపిణీ చేయడం జరిగింది.
ఈ నిత్యావసరాల సరకుల పంపిణీ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కేంద్రనికి చెందిన సేవా సంస్థ శ్రీ రామసేవ సమితి సభ్యులు గందె నర్సింలు, శెనిశెట్టి శ్రీనివాస్, ఉప్పల గిరిధర్, లాబిశేట్టి కిషన్, బోందుగుల ప్రభాకర్, బుచ్చయ్య, తాటిపల్లి సునీల్ ( కుబ్బి ), గౌరీ శంకర్, పప్పుల శ్రీనివాస్, అడ్డగుల ఆశోక్, మామిడి శ్రీనివాస్, మోట్కురి శ్రీనివాస్, యేల్లాంకి కృష్ణ, ప్రసాద్, లాబిశేట్టి శ్రీనివాస్, ఎంపీడీవో బాల్ కిషన్ , తాండా పెద్ద మనుషులు తదితరులు పాల్గొన్నారు.