రేపు కామారెడ్డి జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 3 (అఖండ భూమి న్యూస్);
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం కామారెడ్డి జిల్లా కు వస్తున్నట్లు షెడ్యూల్ ఖరారు అయింది. కామారెడ్డి జిల్లా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలం కావడంతో జిల్లాలో భారీ వర్షాలకు భారీ నష్టం వాటిల్లింది. భారీ నష్టాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి కామారెడ్డి జిల్లాకు వస్తున్నారు. హైదరాబాదు బేగంపేట ఎయిర్ ఫోర్ట్ నుండి ఉదయం 11 గంటలకు ప్రత్యేక హెలిక్యాప్టర్లు లో కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో 11 గంటల 30 నిమిషాలకు వచ్చి నష్టాలను పరిశీలించడం జరుగుతుంది. లింగంపేట్ మండలంలోని బ్రిడ్జిలు, పంటలు పరిశీలించడంతోపాటు మధ్యాహ్నం కామారెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో రెండు గంటలకి జి ఆర్ కాలనీలో పర్యటిస్తారు. మధ్యాహ్నం భోజనం చేయడం చేసిన అనంతరం జిల్లా అధికార యంత్రాంగం తో రివ్యూ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అనంతరం విలేకరుల సమావేశంలో పాల్గొని మూడు గంటల ఐదు నిమిషాలకు తిరిగి బేగంపేట విమానాశ్రయానికి తిరిగి వెళ్తారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ పకడ్బందీ ప్రణాళికతో సీఎం పర్యటన ఏర్పాట్లు చేస్తున్నట్లు చేస్తున్నారు.