రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి జిల్లా ప్రజలకు అండగా ఉంటుంది…

రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి జిల్లా ప్రజలకు అండగా ఉంటుంది…

వందేళ్లలో ఎప్పుడూ రానంత వరద వచ్చింది

ప్రభుత్వం మిమ్మల్ని కచ్చితంగా ఆదుకుంటుంది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 4 (అకాండ భూమి న్యూస్) మీ ఎమ్మెల్యే మదన్ మోహన్ మీకు అండగా నిలిచి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూశారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో లింగంపేట్ మండలంలో పర్యటించారు అనంతరం మీ సందర్భంగా మాట్లాడుతూ.

కష్టం వచ్చినపుడు అండగా ఉండే వాడే నాయకుడు మీకు అండగా ఉండి ఎమ్మెల్యే అడ్డుకున్నారు కష్టాల్లో ఉన్నపుడు ప్రజలకు తోడుగా ఉండాలని నాయకులకు సూచిస్తున్నాను అన్నారు. వరదలకు మైనర్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు దెబ్బతిన్నాయి అన్నారు.పోచారం ప్రాజెక్టు వరదలకు తట్టుకుని నిలబడి మిమ్మల్ని కాపాడింది అని గుర్తు చేశారు. తక్షణమే తాత్కాలిక మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు. ప్రత్యక్షంగా మీ కష్టాలను, జరిగిన నష్టాలను చూడటానికే ఇక్కడకు వచ్చాం అని ప్రజలతో అన్నా రు. శాశ్వత పరిష్కారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినాట్లు తెలిపారు. పంటపొలాల్లో ఇసుక మేటలు తొలగించుకునేందుకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తాం అన్నారు.

పంట నష్టపరిహారం అందిస్తాం

 

రోడ్లు, ప్రాజెక్టులను మరమ్మతులు చేసేందుకు అధికారులు అంచనాలు రూపొందించాలి అని సూచించారు.అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అన్నారు క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులు పూర్తిస్థాయిలో వరద నష్టాన్ని అంచనా వేయాలి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, రాష్ట్ర టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే మదన్మోహన్, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ , అధికారులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!