నేడే ఉపాధ్యాయ దినోత్సవం..

.ఉత్తమ ఉపాధ్యాయుడు అంటే ఎవరు?
వైద్య.శేషారావు జూనియర్ లెక్చరర్ ఇన్ సివిక్స్ ప్రభుత్వ జూనియర్ కళాశాల దోమకొండ..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; సెప్టెంబర్ 4,( అఖండ భూమి న్యూస్ ) ఉత్తమ ఉపాధ్యడు అంటే ఎవరు అన్న ప్రశ్న తరుచుగా ఎదురవుతూనే వుంటుంది. చివరకు ఈ ప్రశ్నకు ”ఉత్తమ ఉపాధ్యాయుడు అంటే, కాల క్రమేణా పిల్లవాడికి తన అవస రం లేకుండా చేసే వాడు” అన్న ది సరైన సమాధానంగా భావిస్తున్నాను. రోజు చేపను ఇవ్వడం కాదు చేపలు పట్టడంనేర్పండి అని చైనీస్ సామెత ఒకటి ఉంది. ఉపాధ్యాయుడు ఏం చేయాలో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మేము చదువు కున్న కాలంలో గైడ్లు ఉండేవి కాదు. మేమే సొంతంగా నోట్స్ తయారు చేసుకునే వాళ్ళం. మా టీచర్లు కూడా దాన్ని బాగా ప్రోత్సహించేవాళ్ళు. పైన చెప్పి న సమాధానానికి నిదర్శనంగా ఓ యాభై ఏళ్ళ క్రితం అంతకు ముందు కూడా నాతో పాటు స్కూల్లో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు.యాభై ఏళ్ళ కిందటి పాఠశాల విద్యకు ప్రస్తుతం ఉన్నపాఠశాలవిద్యకు ఉన్న తేడా ఏంటంటే. మార్కులు, ర్యాంకులకు ఎక్కువ ప్రాధాన్యత ఉండటం. తల్లిదండ్రులు పిల్లల చదువుల విషయంలో ఎక్కువ కలుగజేసుకోవటం, ఎక్కువ. మార్కులు వస్తే ఎక్కువ నాలెడ్జ్ ఉందని సమాజం మొత్తం భావించే పరిస్థితి ఉండటం. ఇదే ప్రస్ఫుటంగా కనిపించే తేడా. దానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు.
సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినం సందర్భంగా అనుభవం లో ఉన్న కొన్ని కారణాలు ప్రస్తావిస్తాను. ఒక ముఖ్యమైన కారణం. కొంతమంది టీచర్ వృత్తిన్ని ఒకఐచ్చికంగా కాకుం డా, ఒక అవకాశంగా భావించ డం దాంతో అది ఒక ఉద్యోగ అవకాశం తప్ప ఇష్టపడి చేసే వృత్తిగా లేదు. దీనివల్లసమస్య ఏమిటంటే ఉపాధ్యాయ శిక్షణ ఒక తూతూ మంత్రంగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే ఉపాధ్యాయుల ఎంపికలో అభ్యర్థులకు ఉన్న పరిజ్ఞానాన్ని, వారి జ్ఞాపకశక్తిని పరీక్షిస్తున్నారు తప్ప, వారి బోధనా సామర్థ్యాన్ని పరీక్షించడం లేదు. దాంతో వృత్తి పట్ల ఇష్టమున్న, మంచి ఉపాధ్యా యులు రావడం లేదు. ఒకప్పు డు ”బతకలేక బడిపంతులు అనే నానుడి ఉండేది. ఇప్పు డు అలా కాదు మంచి జీతం వచ్చే టాప్ టెన్ ఉద్యోగాల్లో టీచర్ ఉద్యోగం కూడా చేరి పోయింది.ఇక రెండో కారణం టీచర్లకి బోధన కన్నా ఇతర పనులు ఎక్కువ ఉండటం. గతంలో టీచర్లకి, బోధన, పిల్లల క్రమశిక్షణ పెంచడం, పిల్లల గురించి వారి అభివృద్ధి గురించి దృష్టి సారించడం మాత్రమే ఉండేవి. క్రమంగా మారిపోయినవిద్యావిధానంలో పేపర్ వర్క్ ఎక్కువ, టీచిం గ్ తక్కువ అయిపోయింది. దాంతో పాఠశాల విద్య కొంచెం బలహీనమైంది నూతన విద్యా విధానం మళ్ళీ కొంచెం ఆశాజ నకంగానే కనబడుతోంది. కానీ వ్యక్తిగతంగా విద్యావిధానం కారణం అనేదాన్ని ఒప్పుకోను. ప్రభుత్వాల నుండి ప్రతి నిత్యం ఏదో ఒక రిపోర్ట్ కై టీచింగ్ చేయడానికి అవకాశాన్ని దూరం చేస్తుంది. విద్యా విధానంలో మార్పులను ఆహ్వానించి విద్యార్థుల దిశా నిర్దేశాన్ని కాలాను గుణం గా తయారు చేయాల్సిందే. వృత్తి పరమైన ఇబ్బందుల ఎప్పటి కప్పుడు పరిష్కరించే పరిస్థి తులు కూడా బలహీనమయ్యే అవకాశాలు మెండుగానే ఉంటాయి.ఏ కాలానికి ఆ విద్యా విధానం ఉంటుంది. విద్యా విధానం మారవచ్చు కానీ, ఉపాధ్యాయుడు మాత్రం మారవలసిన అవసరం లేదు. ఉపాధ్యాయుడు ఎప్పుడూ ఉపాధ్యాయుడే,బోధన పద్ధ తులు మారవచ్చు కానీ, ఉపా ధ్యాయుడు మారవలసిన అవసరం లేదు. అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తనని తాను మలుచుకునే వాడే మంచి ఉపాధ్యాయుడు కదాముందు చెప్పిన మార్కుల సంగతి చూద్దాం.మేంచదువుకుంటున్నప్పుడు పాస్ థర్డ్ క్లాస్ కావడమే ఒక పెద్ద విషయం. ఇప్పుడు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అని లేవు. అన్ని డిస్టింక్షన్ లే! ఎవరికైనా ఫస్ట్ క్లాస్ వస్తేకూడా చాలా బాధ పడతారు. నేను చదువుకున్నప్పుడు ఫెయిల్ అయిన వారికి కూడా కొంచెం డొక్కశుద్ధి ఉండేది. ఇప్పుడు ర్యాంకు వచ్చిన వాళ్లకు కూడా చిన్న చిన్న విషయాలు కూడా తెలియవు. దానికి కారణం పిల్లవాడి తప్పు కాదు.నిజానికి ఎవరి నోట్స్ వాళ్లే తయారు చేసుకోవాలి. ఇప్పుడు అలా కాదు స్కూలు కానీ, టీచర్లు గానీ నోట్స్ ఇస్తారు. ప్రైవేట్ స్కూల్లో అయితే ప్రింటు చేసిన నోట్స్ ఇస్తారు. అదే రాయాలి. సొంతంగారాస్తేఒప్పుకోరు.నేను ఒక స్కూల్ లో ఇంగ్లీష్ టీచర్ గా పని చేసేటప్పుడు ఒక సారి పరీక్షల్లో నేను దిద్ది మార్కులు వేసిన పేపర్ పట్టుకొని ఒక పిల్లవాడి తండ్రి నా దగ్గరకు వచ్చాడు. “మీరు మా అబ్బాయికి తక్కువ మార్కులు వేశారు, వాడి ఫ్రెండ్ కి ఎక్కువ మార్కులు వేశారు. వాడేమో సొంతంగా రాశాడు. మావాడు స్కూల్లో ఇచ్చిన నోట్స్ లో ఉన్న సమా ధానమేరాశాడుఅనివాపోయాడు. నేను రెండు పేపర్లు పరి శీలించాను. స్కూల్ నోట్స్ ప్రకారం రాసిన అబ్బాయి పేపర్ లో తప్పులు లేవు గానీ రొటీన్ ఆన్సర్ రాశాడు, ఎక్కు వ మార్కులు వచ్చిన పిల్లవా డు సొంతంగా ఆలోచించి రాశాడు. అదీ విషయంఇలా చాలా సార్లు తల్లిదండ్రులు పిల్లల చదువులో ఇలా కలగ చేసుకుంటున్నారు, మార్కుల కే ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నా రు, పిల్లల్లో క్రియేటివిటీ పెరగ కపోవడానికి ఇది కూడా ఒక కారణం. విద్యారంగంలో ప్రైవేటీకరణ వల్ల చాలా మార్పులు సంభవించాయి. మార్కులు ర్యాంకుల పట్ల క్రేజ్ పెరగడం, పిల్లలు సొంతంగా ఆలోచించే పరిస్థితిలేకపోవడం వంటివి ముఖ్యమైనవి. ప్రైవే టీకరణ వల్ల టీచర్ ఉద్యోగాలు పెరిగాయ్. ఏ రంగంలోనైనా ప్రైవేటీకరణ వల్ల కలిగే ఇబ్బం దులు విద్యా రంగంలో కూడా ఉన్నాయి. ఇక వేగంగా పెరు గుతున్న సాంకేతిక పరిజ్ఞానం విద్యా రంగంలో కూడా చొచ్చు కు పోయింది. ఇది కంప్యూటర్ యుగం. ఇప్పుడు ప్రతి పాఠ శాలలో కంప్యూటర్లు ఒక భాగం. శాస్త్రీయంగా చూస్తే ప్రాథమిక స్థాయిలో కంప్యూ టర్ల వల్ల నష్టమే గాని లాభం పెద్దగా లేదు. ఇటీవలి కోవిడ్ నేపథ్యంలో ఉపాధ్యాయుల పని కొంచెం కష్టమే అయింది. పిల్లలు కూడా ఇబ్బందే పడు తున్నారు. ప్రాథమిక స్థాయి నుంచే సాంకేతికత పిల్లవాడి జీవితంలో భాగం అయితే జరిగే నష్టాలలో మొదటిది, స్వయంగా ఏ పనైనా చేయ గల, స్వయంగా విషయపరిజ్ఞా నం పెంచుకోగల సామర్థ్యాలు తగ్గిపోతాయి. చిన్న వయసు నుంచే డిపెండెన్సీ ఎక్కువ అవుతుంది. అయితే టెక్నా లజీని రెండు వైపులా పదు నున్న కత్తి లాంటిది. జాగ్రత్తగా వాడితే మంచిదే. అయితే ఉపాధ్యాయులు కూడా టెక్నా లజీని ఒడిసి పట్టుకోవాలి.అది కొంచెం కష్టమే.కానీరవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పి అన్న విషయం గుర్తు పెట్టుకుని తనని తాను టెక్నాలజీకి అనుగుణంగా మార్చుకోగలిగితే కొంతవరకు మంచిదే.ఇక 21 వ శతాబ్దపు ఉపాధ్యాయుడు ఎలా ఉండా లన్నదిఒకసారిచూద్దాం.సాంకేతిక పరిజ్ఞానం సమకాలీన ఉపాధ్యాయుడిని పరిజ్ఞానాన్ని అందించే భాండాగారం కాకుం డా, 21వ శతాబ్దపు నైపు ణ్యా ల వైపుకి పిల్లలను నడిపించే మార్గ దర్శకుడిగామార్చేసింది”
ఈ శతాబ్దపుఉపాధ్యాయుడికి కావాల్సిన అర్హతలు ఇలా ఉం డేఅవకాశంఉంది.నీతివంతమైన, బాధ్యతాయుతమైన, తెలివైన, భావి నాయకులను ప్రభావితం చేయగలిగిన నేర్పు కలిగి, అనంతమైన ఓర్పుసహా నుభూతి, నిరంతరం నేర్చుకో వాలన్న తపన, అనంతమైన శక్తి, వినోదంతో కూడిన మార్గ నిర్దేశకత్వం”.ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఉపాధ్యాయుడు 21వ శతాబ్దపు ఉపాధ్యాయుడికి ఉండవలసిన లక్షణాలను పెంపొందించే దిశగా, వడివ డిగా అడుగులు వేయవలసిన అవసరం ఉంది.కేవలం బోధన రంగంలో ని వారికే కాదు వివిధ వృత్తుల్లో ఉన్నవారు చివరకు ఇంట్లో అమ్మ నుంచి పొలం లో రైతు వరకు వాహనం నడిపే చోదకుణ్ణి నుంచి కుట్టు మెషిన్ నేర్పేఅందరూకాలానుగుణంగా మార్పు చెందల్సిందే.అయితే గురువు కు ఉండే విలువ హృదయం బట్టి ఉంటుంది.


