ఘనంగా వాసవి క్లబ్, ఆర్యవైశ్య ఆధ్వర్యంలో వినాయక శోభాయాత్ర…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 5 (అఖండ భూమి న్యూస్) కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా శుక్రవారం చివరి రోజు శ్రీ సిద్ధి బుద్ధి వినాయకుని ఊరేగింపు శోభయాత్ర శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య మహిళలు కోలాటాల నడుమ, డప్పు వాయిద్యాలతో అందరినీ ఆకట్టుకున్నారు. మహిళలు యువతులు, యువకులు ఎంతో ఉత్సాహంతో చిందులు వేస్తూ భక్తిశ్రద్ధలతో వినాయక శోభాయాత్రను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి క్లబ్ ప్రతినిధులతో పాటు ఆర్యవైశ్య ప్రతినిధులు, సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.