నేషనల్ యూత్ క్లబ్ 53వ వార్షికోత్సవం సందర్భంగా మాజీ జెడ్పిటిసి కి సన్మానం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 5 (అఖండ భూమి న్యూస్) కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని నేషనల్ యూత్ క్లబ్ (ఎన్ వై సి) 53 వార్షికోత్సవం సందర్భంగా మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ కు శుక్రవారం సన్మానించారు. ఎన్వైసీ ఏర్పాటు చేసి 53 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్సవాలలో భాగంగా దోమకొండ మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ తో పాటు డాక్టర్ పాండరీ, కుంచాల శివరాములు, పన్యాల బాల్ రెడ్డి కి ఎన్వైసీ ఫోటో బహూకరణతో పాటు శాలువాతో ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వినాయక మండలి అధ్యక్షులు శరత్ చంద్ర సభ్యులు సచిన్, మద్ద వినయ్, సచిన్, ఆంజనేయులు, కంది మనోజ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.