సి ఎం రేవంత్ రెడ్డి వద్దకు తరలిన గ్రామపాలన అధికారులుగా నియామకమైన 363 మంది
కామారెడ్డి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 5 (అఖండ భూమి న్యూస్)
హైదరాబాదులోని హైటెక్స్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులను పొందేందుకు జిల్లాలో గ్రామ పాలనాధికారులుగా ఎంపికైన వారిని శుక్రవారం జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ కు 7 ప్రత్యేక బస్సుల ద్వారా రెవెన్యూ అధికారులు తీసుకువెళ్లారు. ఆ బస్సులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కలెక్టర్ కార్యాలయం నుండి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.
గతంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో విఆర్వోలుగా మరియు విఆర్ఏ లుగా పనిచేసి ప్రస్తుతం ఇతర డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న వారికి ప్రభుత్వం తిరిగి రెవెన్యూ డిపార్ట్మెంట్ లోకి గ్రామ పాలన అధికారులుగా నియమించడానికి పరీక్ష నిర్వహించింది. ఆ పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని కామారెడ్డి జిల్లాకు 363 మందిని ప్రభుత్వం కేటాయించింది. వారికోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి 335 మందికి హైదరాబాదుకు తరలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ శాఖలలో పనిచేస్తూ మళ్లీ మాతృశాఖ అయిన రెవెన్యూ శాఖలో నియామకం పొందుతున్నందుకు అభినందించి రెవెన్యూ శాఖకు ఉత్తమ సేవలందించి మంచి గుర్తింపు పొందాలని సూచించారు. ఈ బస్సులలో ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థ సింహారెడ్డి, కలెక్టరేట్ ఏవో సఇద్ మసూద్ తదితరులు వెళ్లారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



