ఎన్‌హెచ్-44, సదాశివనగర్ లిమిట్స్ లో స్పీడ్ లేజర్ గన్స్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ , జిల్లా ఎస్పీ …

ఎన్‌హెచ్-44, సదాశివనగర్ లిమిట్స్ లో స్పీడ్ లేజర్ గన్స్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ , జిల్లా ఎస్పీ …

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 8 (అఖండ భూమి న్యూస్)  ప్రజల ప్రాణాలను కాపాడేందుకే వేగ నియంత్రణ ఏర్పాట్లు – నిబంధనలు ఉల్లంఘించిన వారికి స్పీడ్ లేజర్ గన్స్ ద్వారా చాలనాలు సోమవారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆదేశాలతో జారీ చేశారు.

• జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకున్న భద్రతా చర్యలు, కట్టుదిట్టమైన నిబంధనల అమలు ఫలితంగా ఈ సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిందని అన్నారు.

2024 ఆగస్టు వరకు జిల్లాలో మొత్తం 188 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా, 2025 ఆగస్టు వరకు వాటిని 145కి తగ్గించగలిగాం. దీని ద్వారా మొత్తం 22.9% తగ్గుదల నమోదై, అదేవిధంగా మరణాలు 197 నుండి 153కి తగ్గి 22.3% తగ్గుదల నమోదు అయినట్లు తెలిపారు. గాయపడ్డ కేసులు కూడా 181 నుండి 173కి తగ్గగా, గాయపడిన వ్యక్తులు 355 నుండి 298కి తగ్గడం ద్వారా రోడ్డు ప్రమాదాల నియంత్రణలో గణనీయమైన తగ్గుదల నమోదయిందని అన్నారు. ఇది జిల్లా స్థాయిలో రోడ్డు భద్రతా చర్యల విజయాన్ని సూచిస్తూ, ప్రజల ప్రాణ రక్షణలో ఒక గొప్ప ముందడుగుగా నిలిచింది.

రోడ్డు ప్రమాదాల తగ్గుదలకు ప్రధాన కారణాలు — ప్రతిరోజూ వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్‌లు, హెల్మెట్ & లైసెన్స్ లేని వాహనదారులపై కఠిన చర్యలు, అతివేగంగా ప్రయాణించే వారిపై జరిమానాలు విధించడం అని జిల్లా ఎస్పీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ , జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ , సదాశివనగర్, ఎన్‌హెచ్-44 వద్ద అయ్యప్ప ఆలయం సమీపంలో స్పీడ్ లేజర్ గన్స్ ను ప్రారంభించారు.

జిల్లాలో మొత్తం మూడు స్పీడ్ లేజర్ గన్స్ వాహనదారుల వేగాన్ని నియంత్రించడం కొరకు పనిచేస్తున్నవి. అధిక వేగంతో ప్రయాణించే వాహనాలను గుర్తించి జరిమానాలు విధించి క్రమంగా వారి వాహణముల వేగనియంత్రణ చేయడం, తద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించడం ప్రధాన ఉద్దేశం. ఇకపై ఈ లేజర్ గన్స్ జాతీయ రహదారి (ఎన్ హెచ్-44), జాతీయ రహదారి (ఎన్ హెచ్-161), , రాష్ట్ర రహదారులపై ఉంటాయని అన్నారు.

రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ద్వారా మీ ప్రాణాన్ని, మీ కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడుకోండి” అని జిల్లా పోలీసు శాఖ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!