యూరియా కోసం పోలీస్ స్టేషన్లో రైతులకు టోకెన్ల పంపిణీ..!

యూరియా కోసం పోలీస్ స్టేషన్లో రైతులకు టోకెన్ల పంపిణీ..!

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 13 (అఖండ భూమి న్యూస్) కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండల కేంద్రంలో యూరియా కోసం క్యూ లైన్ లో నిలబడ్డ రైతులకు సొసైటీ గిడ్డంలో కాకుండా స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై ఆధ్వర్యంలో సొసైటీ సిబ్బంది టోకెన్లను శనివారం పంపిణీ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోనే కాకుండా కామారెడ్డి జిల్లాలో యూరియా కొరత ఏర్పడింది. రైతులు ఒక్కొక్కరు శుక్రవారం రాత్రి నుండి మొదలుకొని శనివారం వరకు క్యూ లైన్ కట్టారు. క్యూ లైన్ లో చెప్పులు, ఇటుకలు, పాస్ బుక్కులు, రైతులు సైతం క్యూ లైన్ కట్టి పడి కాపులు కాశారు. రైతులకు తక్కువ సంఖ్యలో యూరియా బస్తాలు రావడంతో రైతులు ఇబ్బందులకు గురైనారు. అత్యధికంగా రైతులు యూరియా పంపిణీ వద్దకు రావడంతో యూరియా పంపిణీలో జాప్యం జరిగింది. గత కొన్ని రోజులుగా యూరియా కోసం పడిగాపులు కాస్తున్న రైతులు ఉద్వేగం, యూరియా దొరుకుతుందా అని తీవ్ర ఆవేదనకు గురైనారు. రైతులు నుండి అలజడి రేగింది. దీంతో బిబిపేట్ ఎస్సై ప్రభాకర్ ఆధ్వర్యంలో పోలీసులు వచ్చి రైతులను స్టేషన్ కు తరలించారు. స్టేషన్ ఆవరణలో రైతులకు క్యూ లైన్ లో సొసైటీ సిబ్బందితో పోలీసులు టోకెన్లు అందజేశారు. గతంలో ఎప్పుడు జరగని విధంగా పోలీస్ స్టేషన్లో టోకెన్లు పంపిణీ పై రైతుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. పోలీస్ ల పహారలో టోకెన్ల పంపిణీ పై యూరియా పంపిణి లో నెలకొన్న సమస్యలను ఎత్తి చూపుతుంది.

Akhand Bhoomi News

error: Content is protected !!